సెల్ టవర్ ఎక్కిన ప్రేమికురాలు.. దిగొచ్చిన ప్రేమికుడు.. మూడుముళ్లతో ఏకం

వరంగల్ : ప్రేమించినోడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అతడితోనే సర్వస్వం అనుకుంది. కానీ పెళ్లి మాట వచ్చేసరికి గురుడు ప్లేటు ఫిరాయించాడు. మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ప్రేమ పాఠాలు వల్లించిన ప్రేమికుడు కాదు పొమ్మంటే ఆ యువతి అధైర్యపడలేదు. పోరాటానికి సిద్ధమైంది. సెల్ టవర్ ఎక్కి నిరసన స్వరం వినిపించింది. అతడే నా సర్వస్వమని.. తన పెళ్లి ఆ ప్రేమికుడితోనే జరగాలని పట్టుపట్టింది. చివరకు పోలీసుల జోక్యంతో ఆ జంట ఒక్కటవడంతో కథ సుఖాంతమైంది.

మంచి ఉద్యోగం వచ్చాక మాట మార్చిన ప్రేమికుడు...

హసన్‌పర్తి మండలానికి చెందిన మాలిక హన్మకొండలో నర్సుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన మోషే అనే యువకుడి ప్రేమలో పడింది. కొన్నాళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే గతేడాది కొత్తగూడెం సింగరేణిలో మోషేకు ఉద్యోగం వచ్చింది. జాబ్ వచ్చింది కదా.. పెళ్లి చేసుకుందామంటూ మాలిక వత్తిడి తెచ్చింది. కానీ అతడు దాటవేస్తూ వచ్చాడు. తీరా ఇటీవల మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మాలిక.. ప్రేమికుడి మోసంపై ఆందోళనకు దిగింది మంగళవారం నాడు సెల్ టవర్ ఎక్కి.. నిరసన గళం వినిపించింది.

lover cheated, the woman climbs cell tower atlast got married

హన్మకొండ ఏసీపీ చంద్రయ్య ఆధ్వర్యంలో సెల్ టవర్ దగ్గరకు చేరుకున్న పోలీసులు మాలికతో మాట్లాడారు. మోషేను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. దీంతో మాలిక కిందకు దిగింది. అతడికి కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం పెళ్లికి ఒప్పుకున్నాడు. అయితే ఇంటికెళ్లి తల్లిదండ్రులను తీసుకొస్తానని వెళ్లిన మోషే సాయంత్రమైనా తిరిగి రాలేదు. దీంతో మాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కేయూసీ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వెళ్లి మోషేను మళ్లీ తీసుకొచ్చారు. చివరకు మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో మాలిక - మోషే వివాహం జరగడంతో సెల్ టవర్ ప్రేమ కథ సుఖాంతమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+