యజమానితో డ్రైవర్ భార్య రొమాన్స్: అడ్డుగా ఉన్నాడని మర్డర్, 2 నెలల తర్వాత..
డ్రైవర్ భార్యతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. గత ఆరేళ్లుగా అక్రమ సంబంధం కంటిన్యూ అవుతుంది. ఏం జరిగిందో తెలియదు.. కానీ డ్రైవర్ అడ్డు తొలగించాలని అనుకున్నాడు. మందు తాగించి మరీ మట్టుబెట్టాడు. వరంగల్ జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసిదంది. ఖానాపురం మండలం, బుధరావుపేటలో రెండు నెలల క్రితం ఆదృశ్యమైన ట్రాక్టర్ డ్రైవర్ మిస్సింగ్ కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది.

అడ్డుగా ఉన్నాడని..
తమకు అడ్డుగా ఉన్నాడని యజమానే అతడిని హత్య చేశాడు. బోడియా తండాలో నివసించే కున్‌సోతు రవి, దావూద్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రవి భార్య భారతికి,దావూద్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. రవి డ్రైవర్‌గా పని చేస్తున్న సమయంలో దావూద్, రవి ఇంటికి రాకపోకలు సాగించేవాడు. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నా ఎవరికీ అనుమానం రాలేదు. ఇటీవల రవి, దావూద్ వద్ద పని మానేశాడు. దీంతో దావూద్ భారతిని కలవటానికి వెళ్లటంలో ఇబ్బందులు వచ్చాయి.

మందు తాగించి మరీ..
వారిద్దరూ తరచూ కలుసు కోవాలంటే రవిని అడ్డు తొలగించుకోవటం ఒక్కటే మార్గం అని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 23వ తేదీన రవితో ఫుల్ బాటిల్ మద్యం తెప్పించుకున్నాడు. ఇద్దరూ కలిసి తాగటానికి బుధరావు పేట శివారులోకి వెళ్లారు. శివారులో కూర్చుని మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న రవిని కర్రతో దావూద్ బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడేశాడు. భారతికి విషయం ఫోన్ చేసి చెప్పి, ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్ళిపోయాడు.

శవం తేలడంతో..
మరునాడు ఉదయం బావి దగ్గరకు వెళ్లేసరికి రవి శవం పైకి తేలుతూ కనిపించింది. రెండు బండ రాళ్లను కట్టి బావిలోకి వేయటంతో శవం నీటిలో మునిగి పోయింది. గడిచిన రెండు నెలలుగా ఇద్దరూ ఏమీ తెలియనట్టే ఉన్నారు. రెండు నెలల నుంచి కొడుకు ఇంటికి రాకపోవటంతో రవి తల్లి ఈరమ్మ ఈ నెల 23న ఖానాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు రవి భార్య భారతిని విచారించే సరికి.. దావూద్ హత్య చేసిన విషయం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications