రైల్వే మహిళా టికెట్ ఇన్‌స్పెక్టర్ పై దాడి.. ట్రైన్ నుంచి..!
వరంగల్ : పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణీకులు దారి తప్పారు. మహిళా టికెట్ ఇన్‌స్పెక్టర్ పై అనుచితంగా ప్రవర్తించారు. రైల్లో నుంచి ఆమెను తోసివేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కాజీపేట జంక్షన్ లో జరిగింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ధానాపూర్ వెళ్లాళ్సిన పాట్నా ఎక్స్‌ప్రెస్ లో.. స్లీపర్ క్లాస్ 1 బోగిలో టికెట్లు తనిఖీ చేశారు ట్రావెలింగ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ నీలిమ. ఆ సమయంలో కొందరు ప్రయాణీకులు జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ క్లాస్ కోచ్ లో కనిపించారు. దీంతో నీలిమ వారిని జరిమానా కట్టాలని కోరారు. ఆ కోచ్ లో వీపరీతమైన రద్దీ ఉండటంతో ఆమె మాట ఎవరూ పట్టించుకోలేదు. పైగా నీలిమను బయటకు తోసేశారు.
ప్రయాణీకులు తనను తోసివేయడంతో ప్లాట్‌ఫాంపై పడిపోయారు నీలిమ. ఆమె కాలు ప్లాట్‌ఫాం, ట్రైన్ కు మధ్యన ఉండే గ్యాప్ లో ఇరుక్కుపోయింది. పరిస్థితి గమనించిన కొందరు ప్రయాణీకులు ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. విషయం తెలిసి హుటాహుటిన రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. నీలిమను రైల్వే ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పాట్నా ఎక్స్‌ప్రెస్ కొన్ని నిమిషాల పాటు కాజీపేటలో ఆగడంతో కాస్తా ఆలస్యంగా బయలుదేరింది.

-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్












Click it and Unblock the Notifications