ఐదేళ్ళలో ఐదుగురు ప్రధానులా.. దేశ భవిష్యత్ ఏమవుతుంది? వరంగల్ సభలో ప్రధాని మోదీ
ఇప్పటివరకు మూడు దశల్లోనూ ఎన్డీయేని ప్రజలు ముందుకు తీసుకువెళ్ళారు. ఇప్పుడు నాలుగవ దశలో తెలంగాణలో మీ ఉత్సాహం చూస్తే నాలుగోదశలో కాంగ్రెస్ సీట్లు వెతుక్కోవటానికి మైక్రో స్కోప్ పెట్టి వెతుక్కోవాల్సి వస్తుందన్నారు ప్రధాని మోదీ. వరంగల్ మామునూరు లక్ష్మీ పురంలో నిర్వహించిన బీజేపీ జనసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. నా తెలంగాణా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
తెలంగాణాతో ప్రత్యేక అనుబంధం ఉందన్న మోదీ
ఈరోజు భద్రకాళీ అమ్మవారికి, రామప్ప ఆలయానికి నా ప్రణామాలు అంటూ పేర్కొన్నారు. కాకతీయుల గౌరవ పతాక అయిన ఇంత చారిత్రక నగరంలో మిమ్మల్ని కలిసేందుకు అదృష్టం దక్కింది. నాకు, బీజేపీ వరంగల్ ఎప్పటికీ ప్రత్యేకం, నలభై ఏళ్ళ క్రితం బీజేపీకి రెండే ఎంపీలు ఉన్నప్పుడు అందులో ఒకటి హన్మకొండ నుండే వుంది. వరంగల్ ప్రజలు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పటికీ అండగా ఉన్నారన్నారు.

ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ సమస్యలు
భారత దేశం కలలు కంటుంది వికసిత్ భారత్ గురించి అది బీజేపీతోనే సాధ్యం అన్నారు. వికసిత్ భారత్.. వికసిత్ తెలంగాణా కలలు కంటుంటే మీరు ఎన్డీయే సర్కార్ కు మళ్ళీ పట్టం కట్టాలన్నారు. అబ్ కీ బార్ మోదీ సర్కార్ అని దేశం అంటుంది.. మీరు అదే అంటున్నారు కదా అన్నారు. గత కాంగ్రెస్ హయాంలో జరిగిన పాపాలు అన్నీ ఇన్నీ కావు.. ఎక్కడ కాంగ్రెస్ ఉంటె అక్కడ సమస్యలు ఉంటాయన్నారు.
ఒక్కో ఏడాది ఒక్కో ప్రధాని . దేశ భవిష్యత్ ఏమవుతుంది
10ఏళ్ళ క్రితంవరకు కాంగ్రెస్ చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు. వేలకోట్ల కుంభకోణాలు, అవినీతి స్కాములు బయటపడేవి. ఇప్పుడు మళ్ళీ ఇండియా అలయన్స్ ఐదేళ్ళలో ఐదుగురు ప్రధానులను తీసుకు వస్తామని చెప్తుంది. అలాంటి ప్రభుత్వం మనకు కావాలా అని ప్రశ్నించారు. అలాంటి వారికి దేశం అప్పగిస్తామా అన్నారు. ఒక్కో పార్టీ నుండి ఒక్కో ప్రధానమంత్రి వస్తే దేశ భవిష్యత్ ఏమవుతుంది అన్నారు.
కాంగ్రెస్ అబద్దాల్ కోరు
కాంగ్రెస్ అబద్దాల కోరు అని, తెలంగాణా రాష్ట్ర ప్రజల కంటే ఎవరికీ ఎక్కువ తెలవదన్నారు. రైతుల రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి, మళ్ళీ పదిహేను ఆగస్టు లోపు చేస్తామని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ చేస్తున్న మోసం కాదా అన్నారు. వేములవాడ రాజన్న సాక్షిగా అని ఒట్టు పెడుతున్నారని, సనాతన ధర్మాన్ని విమర్శించే వారి వాగ్దానాలు నమ్మటానికి లేదన్నారు.
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్
కాంగ్రెస్ తెలంగాణా అమరుల కుటుంబాలకు పెన్షన్ ఇస్తామని చెప్పింది, వారికి భూములు ఇస్తామని చెప్పింది, మహిళలకు 2500 ఇస్తామని చెప్పింది.. ఇచ్చిందా అన్నారు. తెలంగాణాలో విద్యుత్ కోతలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణా ప్రజల సొమ్ము లూటీ అవుతుందన్నారు. మొదటి ఆర్ లో హైదరాబాద్, రెండో ఆర్ ఢిల్లీకి వెళ్తుందని చర్చ జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలి ఇండియా అలయన్స్ కు ఏటీఎంగా మారాయి
కాంగ్రెస్ పాలన సాగిస్తున్న రాష్ట్రం ఈ పార్టీల కోసం ఏటీఎంలా మారిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతల వద్ద వందల కోట్లు బయటపడుతున్న ఉదంతాలు చూస్తున్నారన్నారు. మోడీ వీరి అవినీతిని బయటకు తీస్తే మోడీని తిడుతున్నారన్నారు. కాంగ్రెస్ దృష్టిలో దేశపు రాజ్యాంగం మీద ఎలాంటి గౌరవం లేదు. మతపరమైన రిజర్వేషన్లు వద్దని అంబేద్కర్ రాజ్యాంగం చెప్తే స్వలాభం కోసం ముస్లింల రిజర్వేషన్ కోసం మిగతా బడుగు బలహీనవర్గాల రిజర్వేషన్లు తొలగించాలని చూస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ పైనా మోదీ ఫైర్
తెలంగాణలో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ కోసం కేంద్రం ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంటుంది అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజాన్ని బీఆర్ఎస్ మోసం చేసిందని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని చెప్పారని, కానీ చెయ్యలేదన్నారు. దళిత బంధు స్కీం పేరుతో మీ నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. బీఆర్ఎస్ కూడా ముస్లిం ల కోసం ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. మిగతా వర్గాలను విస్మరించారన్నారు.
చర్మం రంగును బట్టి యోగ్యత నిర్దారిస్తారా?
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును చర్మం రంగును బట్టి అవమానిస్తున్నారని, చర్మం రంగును బట్టి యోగ్యతను నిర్దారిస్తారా అంటూ ప్రజలను ప్రశ్నించారు. దేశ ప్రజలను చర్మం రంగు పేరుతో అవమానిస్తే ఇక్కడ అది సాధ్యం కాదన్నారు. మే 13న మీ అందరి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. కమల వికాసం కోసం, వికసిత తెలంగాణా కోసం కమలానికి ఓటు వెయ్యాలన్నారు.
-
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications