ఆ వృద్దుడికి అన్యాయమే జరిగింది.. 2 లక్షలకు, రూ.44 వేలు వచ్చింది..

కడుపులో కణతికి ఆపరేషన్ చేయించుకునేందుకు దాచుకున్న డబ్బులు ఎలుకలపాలయిన ఘటన గురించి ఇదివరకే విన్నాం. మహబూబాబాద్‌కి చెందిన ఆ వృద్దుడు ఆర్బీఐ అధికారులను కలిశారు. తన నగదును ఇవ్వగా.. అంటే 2 లక్షలు ఇవ్వగా తిరిగి రూ. 44 వేలు మాత్రమే వచ్చాయి. మహబూబాబాద్‌కు చెందిన రెడ్యా దీనగాధ ఇదీ.

దాచుకున్న నగదు.. ఇలా

దాచుకున్న నగదు.. ఇలా

కూరగాయలు అమ్ముతూ జీవించే అతనికి కడుపులో కణతి ఉండడంతో ఆపరేషన్ కోసం రూ. 2 లక్షలు దాచుకున్నాడు. వాటిని ఎలుకలు కొరికిపడేశాయి. దీంతో స్థానిక బ్యాంకులకు వెళ్లగా, వారు హైదరాబాద్‌లోని ఆర్‌బీఐకి వెళ్లమని సూచించారు. విషయం తెలిసిన కలెక్టర్ వీపీ గౌతమ్ ఎలుకలు కొరికిన డబ్బులో నంబర్లు ఉన్న వాటిని గుర్తించాలని తహసీల్దార్ రంజిత్ కుమార్‌ను ఆదేశించారు. నంబర్లు ఉన్న 88 నోట్లను గుర్తించిన తహసీల్దార్ వీఆర్ఏ రాజశేఖర్‌ను తోడుగా ఇచ్చి రెడ్యాను నిన్న ఆర్‌బీఐకి పంపారు. ఆ నోట్లను పరిశీలించిన అధికారులు మొత్తం రూ. 44 వేలు చెల్లించారు.

బీరువాలో దాస్తే..

బీరువాలో దాస్తే..

మహబూబాబాద్ జిల్లాలో వేంనూర్ శివారు ఇందిరానగర్ తండాలో ఈ ఘటన జరిగింది. కూరగాయలు అమ్ముకుంటూ రెడ్యా జీవిస్తున్నాడు. 4 ఏళ్ల క్రితం అతను అనారోగ్యానికి గురయ్యాడు. ఏం అయ్యిందని మహబూబాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించుకున్నాడు. కడుపులో కణితి ఏర్పడిందని వారు చెప్పారు. హైదరాబాద్ వెళ్ళాలని సూచించగా.. వచ్చి పరీక్షలు చేయించుకున్నాడు. ఆ కణితి ఆపరేషన్‌కు రూ.4 లక్షల వరకు ఖర్చుఅవుతుందని వైద్యులు తెలిపారు. కడుపులో నొప్పి భరిస్తూనే కూరగాయల వ్యాపారం చేశాడు. అలా కూడబెట్టిన సొమ్ము, మరోవైపు అప్పుగా తీసుకొచ్చిన సొమ్ము సుమారు 2 లక్షల రూపాయలను తన ఇంట్లోని బీరువాలో దాచి పెట్టాడు.

ఎలుకలు కొరకడంతో..

ఎలుకలు కొరకడంతో..


ఇక ఆస్పత్రికి వెళ్లే సమయం వచ్చింది. హాస్పిటల్‌‌కు వెళ్దామని బీరువాలోని డబ్బులు తియ్యగా అవన్నీ చిరిగిపోయి.. ఎలుకలు కొట్టినట్టు కనిపించాయి. ఆ చిరిగిపోయిన నోట్లను మార్చుకోటానికి మహబూబాబాద్‌లోని అన్ని బ్యాంకుల చుట్టూ తిరిగాడు. కానీ ఇక్కడ చెల్లవనే సమాధానం వచ్చింది. హైదరాబాద్‌లో రిజర్వ్ బ్యాంక్‌కు వెళ్లాలని సూచించగా వెళ్లాడు. కానీ అక్కడ కూడా అతనికి అన్యాయమే జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+