Warangal: మేక తలకాయ కోసం తలలు పగలగొట్టుకున్నారు..!

ఓ మేక తలకాయ రెండ గ్రామాలకు చెందిన వ్యక్తుల గొడవకు కారణమైంది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. మేక తలకాయతో గొడవ ఎందుకవుతుందని అనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే.. పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ లో యాట(మేక) తలకాయ కోసం రెడు ఊళ్ల ప్రజలు గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకోవడమే కాదు. కొట్టుకున్నారు కూడా. ఘర్షణలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కొంత మందికి స్వల్ప గాయాల్యయాయి.

అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సెప్టెంబర్ 1న జరిగింది. గత శుక్రవారం అన్నారం దర్గకు కల్లెడకు చెందిన కొంత మంది, పెద్దతండాకు చెందిన కొంత మంది యాట తలకాయలు కొనేందుకు వచ్చారు. అక్కడి చాలా మంది భక్తులు కందూరు చేసేందుకు యాటలను గొర్రె లేద మేకలను తెస్తారు. ఇలా ఓ భక్తులు మేక తెచ్చి కందూరు చేశాడు. మేక తలకాయ వద్దనుకుని అక్కడే అమ్మాలనకున్నాడు. ఈ మేక తలకాయ కోసం కల్లెడ, పెద్దతండా చెందిన వారు పోటీ పడ్డారు.

Two villagers beat each other for a goats head

మాకు కావాలంటే మాకు కావాలని గొడవకు దిగారు. మాటామాట పెరిగి ఒకరికొకరు గల్లాలు పట్టుకున్నారు. ఆ తర్వాత ఘర్షణకు దిగారు. కల్లెడకు చెందన ఓ వ్యక్తి అక్కడే మేకను కోసే కత్తితో పెద్దతండాకు చెందిన వ్యక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. కల్లెడకు చెందిన మరో వ్యక్తి కత్తి పట్టుకున్న వ్యక్తిని ఆపే ప్రయత్నంలో అతని చేతికి గాయమైంది. అయనా కూడా ఆ వ్యక్తి దాటి చేసేందుకు ప్రయత్నించగా.. పెద్దతండాకు చెందిన సంతోష్ అడ్డుకునే ప్రయత్నం చేశఆరు. ఈ క్రమంలో అతను తీవ్రంగా గాయపడ్డారు.

అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన సంతోష్ ను 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ కొనసాగుతోందని ఎస్సై వీరభద్ర రావు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+