ప్రియుడు దక్కలేదని అత్తింట్లోనే ఆత్మహత్య -నవ వధువు రవళి విషాదాంతం

మనసిచ్చిన వాడిని మర్చిపోలేక.. తాళి కట్టిన వాడితో కలిసి జీవించలేక.. మానసిక సంఘర్షణకులోనైన యువతి.. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించింది. పెళ్లి తోరణాలు ఇంకా పచ్చగా ఉండగానే.. అత్తారింట్లో బలన్మరణానికి పాల్పడింది. 'నా మనసులో ఎవరున్నారో మీకు తెలుసు కదా..' అంటూ అమ్మానాన్నలకు చివరి లేఖ రాసింది. పోలీసుల కథనం ప్రకారం..

వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తిని కాదని మరో యువకుడితో పెళ్లి చేశారనే బాధతో అత్తవారింట్లోనే ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం నారాయణగిరికి చెందిన రవళితో వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌ గ్రామానికి చెందిన రాజుకు డిసెంబర్ 11న వివాహం జరిగింది.

 warangal urban: newly married women commits suicide at husband house, due to love affair

ఇష్టం లేని పెళ్లి చేశారంటూ సూసైడ్‌ నోట్‌రాసి సోమవారం(డిసెంబర్ 28) రాత్రి అత్తారింట్లోనే నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ''నా చావుకు ఎవరూ కారణం కాదు. అమ్మా నీకు తెలుసు. కులం, మతం చూడొద్దు. భర్తకు క్షమాపణ చెబుతున్నా'' అని ఆత్మహత్యకు ముందు సూసైడ్‌ నోట్‌ రాసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

పెళ్లి జరిగిన రెండు వారాలకే రవళి ఆత్మహత్యకు పాల్పడంతో ఇటు తల్లిదండ్రులు, అటు అత్తింటివారు విషాదంలో మునిగిపోయారు. బంధువుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+