మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
వరంగల్ నగరంలోని వేణురావు కాలనీలో ఓ మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
వరంగల్: నగరంలోని వేణురావు కాలనీలో ఓ మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని మహబూబాబాద్ పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మౌనికగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మౌనిక మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.
భర్త, అత్తామామలు తమ కుమార్తెను వేధింపులకు గురిచేశారని మౌనిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భర్తే ఉరి వేసి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని అన్నారు. కాగా, మౌనిక మృతదేహంపై గాయాలున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని మౌనిక తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు. మౌనిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమదేళ్ళ క్రితం తమ దగ్గరి బంధువుకు మౌనికను ఇచ్చి పెళ్లి చేశారు. మౌనిక దంపతులకు ఇద్దరు సంతానం కలిగారు. అయితే, కొంత కాలం సాజావుగానే కాపురం సాగింది. ఆ తర్వాత మౌనిక భర్త మద్యానికి బానిసయ్యాడు. తాగి వచ్చి మౌనికను వేధించేవాడు. అయినా అతని వేధింపులను భరించింది. కానీ, చివరకు ఇలా అనుమానాస్పద స్థితి మృతి చెందింది.












Click it and Unblock the Notifications