ప్రాణం మీదకు వచ్చిన ఇన్ స్టా రీల్స్.. ట్రైన్ పక్కనే ఫీట్, పడిపోయి..
ఇప్పుడంతా సోషల్ మీడియా బూమ్.. ఏ చిన్న ఇష్యూ అయినా వీడియోలు చేసేస్తున్నారు. ఎఫ్‌బీ, ఇన్ స్టాలో పోస్ట్ చేస్తున్నారు. రీల్స్‌లో పోస్ట్ చేసి.. తెగ ఆనంద పడిపోతున్నారు. అవును అలాంటివి కొన్ని ప్రాణాల మీదకు వస్తాయి. వరంగల్‌లో ఇలాంటి ఘటన జరిగింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. మీరు ఆ వీడియోను చూడండి.
సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్ల కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వరంగల్‌లో ఓ యువకుడు ఇన్ స్టాగ్రామ్ వీడియో కోసం రిస్క్ తీసుకున్నాడు. అతడి అదృష్టం బాగుండి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. వడ్డేపల్లికి చెందిన ఓ యువకుడు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కోసం ఓ వీడియో చేసేందుకు రైల్వే ట్రాక్ ఎంచుకున్నాడు.

వేగంగా రైలు వస్తుండగా, దానిపక్కనే తాను నడుస్తున్నట్టు చిత్రీకరించాలని భావించాడు. ఖాజీపేట్ వద్ద ఓ రైలు వేగంగా వస్తుండగా, దానికి అత్యంత దగ్గరగా నడిచే ప్రయత్నం చేశాడు. ఆ రైలు వేగానికి యువకుడు ఒక్కసారిగా పక్కకు పడిపోయాడు. అతడికి ప్రాణాపాయం కలగకపోవడంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వెనుక ట్రైన్ వస్తుంటే ట్రాక్ పక్క నుంచి నడుచుకుంటూ వచ్చే వీడియో షూట్ చేస్తున్నాడు. ట్రైన్ ఢీకొనడంతో ఎగరిపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. యువకుడి తలకు, కాలుకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కానీ అతని ఫ్రెండ్స్ మాత్రం ఆందోళన చెందారు. వెంటనే అతనిని పిలిచారు. ఆ వీడియో అప్పటికే పూర్తవుతుంది. 10 సెకన్ల నిడివి గల వీడియో.. ఇప్పుడు ట్రోల్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. లైకులు, కామెంట్ల కోసం సాహసాలు చేయొద్దని కోరుతున్నారు.
హన్మకొండలో ఇంస్టాగ్రామ్ రీల్స్ చేయబోయి ప్రాణలమిదికి తెచ్చుకున్న యువకుడు..!!#Hanumakonda #InstagramReels #TelanganaNews #OneIndiaTelugu pic.twitter.com/nNtcurR8oh
— oneindiatelugu (@oneindiatelugu) September 4, 2022
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications