కరోనా కలవరం: ఆరుగురు టీచర్లు, ఇద్దరు విద్యార్థులకు వైరస్

ఏపీలో కరోనా ఉధృతి కొససాగుతూనే ఉంది. ఇటు స్కూళ్లు తెరవడంతో కుప్పలు తెప్పలుగా కేసులు అవుతున్నాయి. తాజాగా మరిన్ని కేసులు వెలుగుచూశాయి. మరో ఇద్దరు విద్యార్థులు, ఆరుగురు టీచర్లకు కొవిడ్‌ సోకింది. పాజిటివ్‌ నిర్ధారణ అయిన టీచర్లలో ధర్మవరం ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఎస్జీటీలు, ఆరుగురు ఎంపీ యూపీ స్కూలులో ఒక స్కూల్‌ అసి స్టెంట్‌, కమతాలపల్లి ఈస్ట్‌ (వీరవాసరం) ప్రాథమిక పాఠశాల, బలేపల్లి ఎంపీ యూపీ పాఠశాల, అనాకోడేరు మెయిన్‌ ప్రాథమిక పాఠశాలలో ఒక్కొక్క ఎస్జీటీ ఉన్నారు. విద్యార్థుల్లో యమునేపల్లి (భీమవరం రూరల్‌) ప్రాథమిక పాఠశాల, జిన్నూరు జడ్పీ హైస్కూల్‌ నుంచి ఒక్కొక్కరికి కరోనా సోకినట్టు కొవిడ్‌ పరీక్షల నివేదికలో తేలింది. దీంతో బుధవారం వరకు జిల్లాలో మొత్తం 55 మంది విద్యార్థులకు, 32 మంది టీచర్లకు కరోనా నిర్ధారణ అయింది.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

 6 teachers and 2 students infected coronavirus

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+