చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు: రిమాండ్‌కు తరలింపు
పశ్చిమగోదావరి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మరో కేసులో కోర్టు రిమాండ్ విధించింది. పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన చెరుకు జోసెఫ్‌కు ఈ ఏడాది ఆగస్టు 28న చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దాడి చేసి, కులం పేరుతో దూషించారని కేసు నమోదైంది.
ఈ కేసును ఉపసంహరించుకోవాలని, లేదంటే కుటుంబసభ్యుల అంతు చూస్తామని చింతమనేని ప్రభాకర్, మరికొంతమంది బెదిరించినట్లు ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో మరోసారి జోసెఫ్ ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా చింతమనేనిని పిటీ వారెంట్‌పై జిల్లా జైలు నుంచి ఏలూరులోని సెకండ్ ఏజెఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చారు.

అక్టోబర్ 28వ తేదీ వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. గత నెల సెప్టెంబర్ 11న ఒక ఎస్ఐ ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టయిన చింతమనేని.. ప్రస్తుతం ఏలూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే 13 కేసుల్లో పోలీసులు పిటీ వారెంట్‌పై అరెస్టే చూపించడం గమనార్హం.
చింతమనేని ప్రభాకర్ విడుదల కావాల్సి ఉండగా.. మరో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. చింతమనేనిపై ఈ నెలన్నర వ్యవధిలో దాదాపు తొమ్మిది కేసులు నమోదు కావడం గమనార్హం. అంతేగాక, ఆయనపై ఇప్పటి వరకు 50 ఫిర్యాదులు వచ్చాయి. పెదవేగి మండలం పినకడిమికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తిని బెదిరించాడన్న కారణంతో తాజాగా ఏలూరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
చింతమనేని మరో ఇద్దరు తనను దుర్భాషలాడారంటూ పిడిమికి చెందిన జోస్ గతంలో ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఆ కేసులో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కాగా, వేరే కేసుల్లో అరెస్టై రిమాండ్‌లో ఉన్న చింతమనేనినని మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఏ త్రీగా ఉన్న చింతమనేనికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇప్పుడు మరో కేసు చింతమనేనిపై నమోదైంది. చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications