హమ్మయ్యా.. ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ పవన్ కల్యాణ్
అభిమానుల అత్యుత్సాహం స్టార్లకు తలనొప్పిగా మారుతుంది. ఎప్పుడు ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ అలాంటి ఘటన మరొకటి జరిగింది. మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొనేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చారు. రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్నది మొదలు... నరసాపురం చేరుకునేవరకు అభిమానుల కోలాహలం ఉంది.
పవన్ కోసం జన సైనికులు, ఫ్యాన్స్ పోటెత్తారు. ఈ క్రమంలో తృటిలో ప్రమాదం పవన్ కల్యాణ్ తప్పించుకున్నారు. తన వాహనంలోంచి పైకి లేచి నిలబడి పవన్ అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేస్తున్నారు. ఇంతలో ఓ అభిమాని అకస్మాత్తుగా పవన్ ఉన్న వాహనంపైకి వచ్చాడు. అతడు వేగంగా దూసుకు వచ్చి పవన్‌ను ఢీకొట్టాడు. దాంతో పవన్ ఒక్కసారిగా కిందపడిపోయారు. అయితే ఆయన కారుపైనే చతికిలపడినట్టుగా కూలబడడంతో ప్రమాదం తప్పింది. కిందపడితే గాయపడేవారు.

తర్వాత పైకి లేచి యథావిధిగా ముందుకు సాగారు. రోడ్ షో సందర్భంగా ఓ యువతి కారు బాయ్ నెట్ పైకి ఎక్కి మరీ పవన్‌కు హారతి ఇవ్వడం కనిపించింది. ఇదీ ఓకే కానీ.. ఓ యువకుడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఏ కొంచెం.. అటు ఇటు అయిన అంతే సంగతులు. కిందపడేవారు.. గాయాలు అయ్యేవి. ఇద్దరు గాయపడేవారు. కానీ ఇవాళ పవన్ కల్యాణ్ అదృష్టం బాగుంది. సెకనులో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో జనసైనికులు, మిగతా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Ilanti abhimanam manchida ? @PawanKalyan anna ki emaina ayunte akkada ?
— ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ✍️ (@Harinani_) February 20, 2022
🙏 pic.twitter.com/BnlhfqXLQf
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications