టీడీపీలో విషాదం: తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత -కరోనా నుంచి కోలుకున్నా..
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వై.టీ. రాజా(69) కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ నేత అయిన రాజా.. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కొవిడ్-19 వ్యాధికి గురై, తిరిగి కోలుకున్నప్పటికీ, ఆదివారం ఉదయం ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు.
రాజా మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు. తణుకులో, టీడీపీలో విషాద ఛాయలు అలముకున్నాయి. రాజా చనిపోయిన సంగతి తెలుసుకున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు కార్యకర్తలు, నేతలు హైదరాబాద్‌కు పయనమయ్యారు. రాజా మృతిపట్ల టీడీపీ చీఫ్ చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వైటీ రాజా తెలుగుదేశం పార్టీ తరఫున 1999లో తణుకు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2009లో టీడీపీ తరఫునే పోటీచేసిన ఆయన పరాజయం పాలయ్యారు. 2014 నుంచి ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. 2014లో ఆరిమిల్లి రాధాకృష్ణను టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాధాకృష్ణ గెలుపుకోసం రాజా కృషిచేశారు.
Recommended Video
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications