ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల దుర్మరణం...

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం (సెప్టెంబర్ 14) ఉదయం భీమవరం నుంచి వెళ్తున్న ఓ కారు తణుకు సమీపంలో అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను స్థానిక మున్సిపల్ ఆఫీసులో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసే జీవన శేఖర్,కంప్యూటర్ ఆపరేటర్ శ్రీను,వెలుగు డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సుభాషిణిగా గుర్తించారు.

భీమవరానికి చెందిన ఈ ముగ్గురు ఉద్యోగులు తణుకులో పనిచేస్తుండటంతో ప్రతీరోజూ కారులో వెళ్లి వస్తుండేవారు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం భీమవరం నుంచి తణుకు బయలుదేరారు. కానీ ప్రమాదవశాత్తు కారు పంట కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ ముగ్గురి కుటుంబాల్లో శోకసంద్రంలో మునిగిపోయాయి. ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

three killed in a road accident near tanuku in west godavari district

Recommended Video

    IAS officer Amrapali Kata appointed in PMO | Oneindia Telugu

    ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ తాడేపల్లిగూడెం నుంచి తణుకు వెళ్లే జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ చెట్టును ఢీకొట్టడంతో అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. లారీ ఫినాయిల్ ఆల్కహాల్ బారెల్ లోడ్‌తో తణుకు వైపుగా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లారీ చెట్టును ఢీకొనడంతో క్షణాల్లో మంటలు చెలరేగి డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+