వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Curd: రాత్రిపూట పెరుగు తింటున్నారా.. అయితే ఇబ్బందుల్లో పడ్డట్లే..

|
Google Oneindia TeluguNews

పాలు, పెరుగు, నెయ్యి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని తాగిన మోతాదులో తీసుకుంటేనే మంచిది. ఎక్కువ తీసుకుంటే నష్టమే. ముఖ్యంగా పెరుగు అతిగా తినొద్దు. చాలా మందికి పెరుగు లేనిది భోజనం చేసినట్లు అనిపించదు. పెరుగు రోజూ తినడం మంచిదేనా. ఒకవేళ తిన్నా రాత్రి పూట తినాలా లేక పగటి పూట తినాలో తెలుసుకుందాం.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరంలో తేమ శాతం తగ్గిపోకుండా కాపాడి, ఇమ్యూనిటీని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎముకలను బలంగా ఉంచేందుకు, జీర్ణ శక్తిని మెరుగు పరిచేందుకు సహకరిస్తుంది. రోజూ పెరుగు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదేనని వైద్యులు చెబుతున్నారు. అయితే ఎప్పుడు తినాలనేది చాలా మందికి డౌట్ ఉంది.

ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు..

ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు..

అయితే పెరుగు రాత్రిళ్లు తినకూడదనే అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి. రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చని చెబుతున్నారు. ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు రాత్రి తింటే జలుబు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మీరు దగ్గు లేదా జలుబుతో బాధపడుతుంటే రాత్రి వేళ పెరుగు అస్సలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రిపూట తింటే ఏమవుతుంది..?

రాత్రిపూట తింటే ఏమవుతుంది..?

రాత్రిపూట పెరుగు తినడం వల్ల గొంతులో కఫం ఏర్పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వర్షాలు కురిస్తున్నప్పుడు పెరుగు తింటే జలుబు, తగ్గు వచ్చే అవకాశం ఉంది.ఒకవేళ మీరు తప్పనిసరిగా పెరుగు తినాల్సి వస్తే.. పలుచని మజ్జిగ తాగాలని సూచిస్తున్నారు. రాత్రివేళల్లో పెరుగు తింటే జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందట.

English summary
Do not eat curd at night..? Let's find out what happens if you eat yogurt at night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X