వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

WTC final: భారత్‌లో లైవ్ టెలికాస్ట్ ఎప్పుడు..ఎలా చూడొచ్చు: తెలుగు కామెంటేటర్‌గా ఎంఎస్‌కే

|
Google Oneindia TeluguNews

లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC final) ఫీవర్ క్రికెట్ ప్రేమికులను ఆవరించేసింది. ఇంకో రెండు రోజుల్లో వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోంది. మూడోరోజు మధ్యాహ్నం మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ కోసం ఈ శుక్రవారమే ఇంగ్లాండ్‌ సౌథాంప్టన్‌‌లోని రోజ్ బౌల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. రెండు జట్లూ సన్నాహాక మ్యాచ్‌లను ఆడేశాయి. కోహ్లీసేన ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌ను ఆడగా.. దీనికి భిన్నంగా కివీస్- ప్రొఫెషనల్ టెస్ట్ సిరీస్‌ను విజయవంతంగా ముగించుకుంది. ఇంగ్లాండ్‌పై రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను తన వశం చేసుకుంది.

 సర్వత్రా ఉత్కంఠ

సర్వత్రా ఉత్కంఠ

అవడానికే టెస్ట్ మ్యాచే. క్రికెట్ ప్రపంచాన్ని ధనాధన్ ఫటాఫట్ టీ20 ఫార్మట్ శాసిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- రిజల్ట్ వెలువడాలంటే అయిదు రోజుల పాటు ఎదురు చూడాల్సిన టెస్ట్ మ్యాచ్ ఇది. అయినప్పటికీ- మచ్ అవైటెడ్ మ్యాచ్‌గా గుర్తింపు పొందింది. దీనికి కారణాలు లేకపోలేదు. ఒకటి- ప్రపంచ టెస్ట ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కావడం.. రెండు- టీమిండియా ఫైనల్‌కు చేరట.. మూడు- సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ కమ్ కేప్టెన్‌గా అభిమానులతో ముచ్చటగా మామా అని పిలిపంచుకుంటోన్న కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ టీమ్ ఫైనల్‌లో కోహ్లీసేనను ఢీ కొట్టబోతోండటం.

రిజల్ట్ ఎలా ఉండొచ్చు..

రిజల్ట్ ఎలా ఉండొచ్చు..

ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్.. ఇంగ్లాండ్ జట్టును ఆ దేశ గడ్డ మీదే ఓడించిన విషయాన్ని టీమిండియా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభను కనపరిచింది. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణించింది కేన్ మామ టీమ్. ఇంగ్లాండ్ వంటి వరల్డ్‌క్లాస్ జట్టును రెండో ఇన్నింగ్‌లో 122 పరుగులకే కట్టడి చేశారు కివీస్ బౌలర్లు. సునాయాస విజాయాన్ని అందుకుందా జట్టు. మిడిలార్డర్‌ కాస్త బలహీనంగా కనిపిస్తోన్నప్పటికీ- అరంగేట్రంలోనే అదరగొట్టిన డెవాన్ కాన్వే, అనుభవజ్ఞుడు రాస్ టేలర్, కేన్ విలియమ్సన్ వంటి బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా చారిత్రాత్మక మ్యాచ్‌లో చేదు ఫలితం తప్పకపోవచ్చు

లైవ్ టెలికాస్ట్ ఎలా..

లైవ్ టెలికాస్ట్ ఎలా..

భారత్ సహా మొత్తం 11 దేశాల్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత్‌లో స్టార్ నెట్‌వర్క్ గ్రూప్‌లోని ఏడు వేర్వేరు ఛానళ్ల ద్వారా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఆన్‌లైన్ లైట్ స్ట్రీమింగ్‌లో చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీల్లో హిందీ, ఇంగ్లీష్‌, స్టార్ గ్రూప్ ప్రాంతీయ ఛానళ్లల్లో తెలుగు, తమిళం, కన్నడల్లో కామెంటరీ వినొచ్చు. బంగ్లాదేశ్-ఘాజీ టీవీ, ఆఫ్రికా-సూపర్ స్పోర్ట్స్, న్యూజిలాండ్-స్కై స్పోర్ట్స్, బ్రిటన్-స్కై యూకే, అమెరికా, కెనడా-విల్లో టీవీ, సింగపూర్-హాట్‌స్టార్, ఆస్ట్రేలియా-ఫాక్స్ స్పోర్ట్స్, కరేబియన్-ఫ్లో స్పోర్ట్స్ ఛానళ్లలో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమౌతుంది.

 తెలుగు సహా కామెంటేటర్ల ఫుల్ లిస్ట్

తెలుగు సహా కామెంటేటర్ల ఫుల్ లిస్ట్

హిందీ, ఇంగ్లీష్ సహా అయిదు భాషల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కామెంటరీని వినొచ్చు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కామెంటరీ అందుబాటులోకి తీసుకొచ్చింది స్టార్‌ నెట్‌వర్క్. ఇంగ్లీష్‌లో- భారత తరఫున సునీల్ గవాస్కర్, దినేష్ కార్తిక్, న్యూజిలాండ్ వైపు నుంచి సైమన్ డౌల్.. ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్నందున.. ఆ దేశానికి మాజీ క్రికెటర్లు నాజిర్ హుస్సేన్, మైక్ అథర్టన్ కామెంటరీ వినిపిస్తారు. హిందీలో- ఆకాష్ చోప్రా, సంజయ్ బంగర్, వీవీఎస్ లక్ష్మణ్, ఇర్ఫాన్ పఠాన్, జతిన్ సప్రు మాట్లాడతారు.

 తెలుగులో ఎంఎస్‌కే ప్రసాద్

తెలుగులో ఎంఎస్‌కే ప్రసాద్

టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ ఈ మ్యాచ్ కోసం కామెంటరీ అవతారం ఎత్తనున్నారు. తెలుగులో ఆయన తన కామెంటరీని వినిపిస్తారు. ఎంఎస్‌కేతో పాటు కౌశిక్ ఎన్‌సీ, ఆశీష్ రెడ్డి, కల్యాణ్ కృష్ణ దొడ్డపనేని, వేణుగోపాల్ రావు కామెంటేటర్లుగా వ్యవహరిస్తారు. తమిళంలో- లక్ష్మీపతి బాలాజీ, హేమంగ్ బదాని, అభినవ్ ముకుంద్, ముత్తురామన్ ఆర్, యోమహేష్ విజయకుమార్ కామెంటేటర్లుగా ఉంటారు.

 అంపైర్లు వీరే..

అంపైర్లు వీరే..

ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, మైఖెల్ గాఫ్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ క్రిస్ బ్రాడ్ ఐసీసీ మ్యాచ్ రెఫరీగా ఎన్నికయ్యాడు. అలాగే- రిచర్డ్ కెటెల్‌బోరో అంపైర్ల ఎలైట్ ప్యానెల్‌కు ఎంపికయ్యాడు. టీవీ అంపైర్‌‌గా వ్యవహరిస్తాడతను. అలెక్స్ వార్ఫ్ ఫోర్త్ అంపైర్‌గా ఉంటారు. ఇవన్నీ కుదిరేశాయి. ఇక మ్యాచ్ ఆరంభం కావడం ఒక్కటే మిగిలి ఉంది. దీనికోసం ఇంకో 48 గంటల పాటు ఎదురు చూడక తప్పట్లేదు.

English summary
India and New Zealand are set to clash in the final of the World Test Championship starting 18th June. This is arguably among the greatest and most anticipated Test matches in the 21st century.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X