జానాకు టిడిఎఫ్ బహిరంగ లేఖ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తగిన విధంగా ప్రతిస్పందించాలని అమెరికాలోని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడిఎఫ్) ప్రతినిధులు కాలిఫోర్నియాలోని సాన్ జోష్ ను సందర్శించిన రాష్ట్ర హోంమంత్రి కె. జానారెడ్డిని కోరారు. ఈ మేరకు వారు జానారెడ్డికి ఈ నెల 20వ తేదీన ఒక బహిరంగ లేఖను సమర్పించారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని వారు గుర్తు చేశారు. బుచ్చన్న గాజుల, బిక్షం పాలబిందెల, లక్ష్మీనారాయమ నింద్రా, రవి తిరుకోవెల, వెంకట్ రెడ్డి, జగన్ బీరెల్లి జానారెడ్డిని కలిశారు.
బహిరంగ లేఖను సమర్పించడంతో పాటు వారు జానారెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ 41 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల సంతకాలతో సోనియా గాంధీకి సమర్పించిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ వినతిపత్రంపై జానారెడ్డి కూడా అప్పట్లో సంతకం చేశారు. అమెరికా పర్యటన సందర్భంగా ప్రణబ్ ముఖర్జీకి సమర్పించిన వినతి పత్రాన్ని వారు జానారెడ్డికి అందజేశారు. ఐదు ప్రశ్నలతో సోనియా గాంధీకి సమర్పించిన వినతిపత్రాన్ని ఇచ్చారు. కొత్తగా హోంమంత్రి జానారెడ్డికి వినితిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ తన హామీని నిలబెట్టుకోవాలని వారు జానారెడ్డిని కోరారు.












Click it and Unblock the Notifications