అమెరికాలో వాసవి జయంతి ఉత్సవాలు

భవ్య పానుగంటి, నీహారిక జలదంకి, వంకారమ్య భజనలతో పూజ ఉదయం పదిన్నరకు ప్రారంభమైంది. భజనలకు మీనాక్షి రామ్మూర్తి మార్గదర్శకత్వం వహించారు. తర్వాత వాసవి మాత అభిషేకం జరిగింది. లివర్ మోర్ ఆలయ పూజారులు సహస్రనామం, అష్టోత్తర అర్చన, మగళ హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. వాసవి అమ్మవారి విశిష్టత గురించి వక్తలు వివరించారు. ఆమ్మవారి అహింసా మార్గాన్ని జీసస్ క్రీస్తు, గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ, సత్యసాయిబాబాబు, పొట్టిశ్రీరాములు అనుసరించారని చెప్పారు.
రావు పానుగంటి తదితరులు ఉన్న వాసవీ సేవా ఫౌండేషన్ కమిటీ సహాయంతో నాగేంద్ర జలదంకి ఈ సంవత్సరం సమన్వయ కర్తగా వ్యవహరించారు. వాసవి సేవా ఫౌండేషన్ కార్యదర్శిగా రావ్ పానుగంటి, కోశాధికారిగా ఎలిసెట్టి గుప్తా, అధ్యక్షుడుగా వీఅర్ రంగనాధ్ ఉన్నారు. శాన్ జోస్, సిఎ లో వాసవి మాత ఆలయం నిర్మించడంలో కూడా ఈ సంస్ధ కీలక పాత్ర పోషిస్తోంది.
బే ఏరీయాలోని ప్రముఖ ప్రవాస భారతీయులు విజయ చవ్వా, లక్ష్మి, గండే తిరుపతయ్య శివ్వా దీపక్, బాలరాజు గార్లపాటి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నోరూరించే దక్షిణ భారత భోజనాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. జాతీయ స్ధాయి వాసవి జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం ఎన్ ఆర్ ఐవిఎ సమన్వయంతో అమెరికాలోని 50 రాష్ట్రాల్లోను, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిర్వహించనున్నారు












Click it and Unblock the Notifications