డల్లాస్ లో సంబరాల సమావేశం

NRI
2009 బతుకమ్మ, దసరా సంబరాల కోసం అమెరికాలోని డల్లాస్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి వివిధ సంఘాలు, వర్గాల నుంచి 50 మంది దాకా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఐదు వేల డాలర్లకు పైగా విరాళాలు సమకూరాయి. డిస్కవర్ ట్రావెల్ కు చెందిన రామ్ యలమంచిలి మెగా స్పాన్సర్ గా నిలవగా, సూర్యనాయుడు గ్రాండ్ స్పాన్సర్ గా నిలిచాడు. అనంత రెడ్డి పజ్జూరు స్వాగతోపన్యాసంతో, చంద్ర బండారు ప్రార్థనతో సమావేశం ప్రారంభమైంది. ఇంతకు ముందు బతుకమ్మ, దసరా సంబరాలను ఎంత ఘనంగా నిర్వహించారో అనంతరెడ్డి వివరించారు. నిరుడు 80 మంది అంకిత భావం వల్ల సంబరాలు జరిగిన తీరును సతీష్ రెడ్డి చెప్పారు.

2009 బతుకమ్మ, దసరా సంబరాలు జరిగే తేదీని, స్థలాన్ని సతీష్ రెడ్డి, జానకి మందాడి ప్రకటించారు. ఈ సంబరాలు సెప్టెంబర్ 26వ తేదీ శనివారం ఓక్ పాయింట్ సెంటర్ లోని అంఫీ థియేటర్ లో జరుగుతాయి. ఈ సంబరాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలను ఇతర వివరాలను జానకి మందాడి వివరించారు. శ్రీధర్ రెడ్డి కోర్సాపాటి (టాంటెక్స్ అధ్యక్షుడు), సతీష్ రెడ్డి (ఆటా రీజినల్ కో ఆర్డినేటర్), మురళీ వెన్నం (తానా ఎస్ డబ్ల్యు రీజినల్ కో ఆర్డినేటర్), కరుణ దాసరి (టిడిఎఫ్ సంయుక్త కోశాధికారి), రామ్ కాసర్ల (టిడిఎఫ్, రిజీనల్ కో ఆర్డినేటర్) తాము బతుకమ్మ సంబరాలకు అందిస్తున్న మద్దతును వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+