సిఎంకు ఎన్నారైల శుభాకాంక్షలు

అట్లాంటా, వాషింగ్టన్ డిసిల్లో ఈ నెల 5వ తేదీన జరిగిన కార్యక్రమంలో 250 మందికి పైగా పాల్గొన్నారు. అట్లాంటా కార్యక్రమాన్ని చిత్తరి పబ్బ, శ్యాం తల్లం, ఆనంద్, రాఘవ, నాగేష్, రాఘవేంద్ర, రవీంద్ర కందుల తదితరులు నిర్వహించారు. విధాన నిర్ణయాల్లో రోశయ్య పద్ధతిని వారు ప్రశంసించారు. ఆర్థిక పరిస్థితి మెరుగుకు రోశయ్య చేస్తున్న కృషిని వక్తలు అభినందించారు.
వాషింగ్టన్ డిసి, వర్జినీయా, మేరీలాండ్ ల్లోని ఎన్నారైలు రమేష్ కల్వల, బాలా వోలేటి, శ్రీనివాస్ తునుగుంట్ల, సతీష్ సొల్లేటి, రాజేష్ బాదం, రాజు తోట, సునీతా కరంశెట్టి, పార్థా కరంశెట్టి, జీవన్ కరంశెట్టి, అనిల్ నార్ల, గురుమూర్తి దాచేపల్లి, కృష్ణ ముంగల, రజనీ కొప్పురపు, రాధా భావనాద్రి, తదితరులు సమావేశమైన రోశయ్య పాలనను అభినందించారు. బే ఏరియా, బోస్టన్, న్యూ ఇంగ్లండు, చార్లొట్టి, చికాగో, క్లెవ్ లాండ్, డల్లాస్, దెన్వెర్, డెట్రాయిట్, హూస్టన్, న్యూజెర్సీ, తాంపా, ఓర్లాండో, సెయింట్ లూయిస్ నగరాల్లో రోశయ్యను అభినందిస్తూ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications