అమెరికాలో తొలిసారిగా తెలుగు 'వెండితెర వేదిక'

అష్టావధాని డా. పుదూరు జగదీశ్వరన్ మాట్లాడుతూ ఇటీవల రంగులు అలుముకున్న పాత చిత్రం మాయా బజారు విశేషాలను వివరించారు. తెలుపు నలుపు చిత్రాలను వర్ణ చిత్రాలుగా మార్చడంలో సాంకేతిక వివరాల గురించి ప్రస్తావించారు. మహాభారతం ఇతివృత్తంగా కౌరవులు పాండవులు ఒక్కరు కూడా లేకుండా సినిమా తీయడం మాయా బజారులో ఒక విశేషం అని వివరించారు. తరువాత డా. జువ్వాడి రమణ తెలుగు సినిమాలలో పద్యాల గురించి ప్రసంగించారు. భువన విజయం, తిక్కన మహాభారతం, పాండవోద్యోగ విజయాలలోని పద్యాలు తెలుగు సినిమాలలో ఎలా చిత్రీకరించారో వివరించారు. తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ రాజేంద్ర నారాయణ్ దాసు తెలుగు హిందీ ప్రేక్షకుల అభిరుచుల వ్యత్యాసాలను గురించి ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications