వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో సిల్వర్ జూబ్లీ రీ యూనియన్

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
కిట్స్ - రామ్‌టెక్ 1986 బ్యాచ్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులు ఇటీవల అమెరికాలోని ఫిలడేల్ఫియాలో సిల్వర్ జూబ్లీ రీయూనియన్ ఉత్సవాలు నిర్వహించుకున్నారు. ఈ ఉత్సవాలు మే 28వ తేదీన ప్రారంభమై 30వ తేదీన ముగిశాయి. క్లాస్‌మేట్స్‌కు రామకృష్ణ అనుగుల, రవి వీరెల్లి స్వాగతం చెప్పడంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జయరామ్ పెన్నా యాంకర్‌గా, మోడరేటర్‌గా వ్యవహరించారు. దాదాపు 50 మంది తెలుగు ప్రాంతానికి చెందిన క్లాస్‌మేట్స్ ఒక చోట చేరారు.

క్లాస్‌మేట్స్ అంతా క్రికెట్ వంటి వివిధ ఆటలు ఆడారు. తమ కళాశాల రోజులను గుర్తు చేసుకున్నారు. కళాశాల రోజులకు సంబంధించిన ఫోటోగ్రాఫ్‌లను భగ్వాన్ చినితిరెడ్డి ప్రదర్శించారు. వాటి ద్వారా వారు పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. సుధ, జ్యోత్స్న, సుజ్వల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. గేమ్ షో అందరినీ అలరించింది. రవి వీరెల్లి, సదాశివ కవిత్వ సెషన్‌ను మోడరేట్ చేశారు.

వీరు తమ తమ ప్రాంతాల్లోని పాఠశాలల్లో సౌకర్యాల కోసం, విద్యార్థులకు ఫీజుల కోసం విరాళాలు ఇస్తూనే ఉన్నారు. వివిధ రూపాల్లో తమ తమ ప్రాంతాల్లోని వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కిట్స్ 86 బ్యాచ్ వారు ఆంధ్రప్రదేశ్‌లోని పేద ఇంజనీరింగ్ విద్యార్థులకు సహాయం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి సహాయ పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల పాఠశాలలకు కంప్యూటర్ పరికరాలు అందజేశారు. వరంగల్‌ జిల్లాలో దేవాలయ నిర్మాణానికి విరాళం ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో నిరుడు పర్యటించి బియ్యం, బ్లాంకెట్లు, ఇతర నిత్యావసర సరుకులను పంచి పెట్టారు.

తిరుమల నెల్లుట్ల, వెంకట్ మాదా, భాస్కర్ కుచన, వేణుమాధవ్ కొలిపాక తమ తమ అభిప్రాయాలను, తమ భవిష్యత్తు ప్రణాళికలను చెప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై రమేష్ రవ్వా చర్చా కార్యక్రమాన్ని సాగించారు.

English summary
The alumni of 1986 natch Engineering graduates from KITS - Ramtek have celebrated their Silver jubilee re-union event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X