హత్యకేసులో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

వివరాలలోకి వెళితే కృష్ణా జిల్లాకు చెందిన లక్ష్మీ నివాస్‌కు కొన్నేళ్ల క్రితం తమ మేనత్త కూతురు జయలక్ష్మితో వివాహం జరిగింది. ఆయనకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు తేజస్విని, కుమారుడి పేరు శివకుమార్. ఎనిమిదేళ్ల క్రితం లక్ష్మీ నివాస్ భార్యా పిల్లలను తీసుకొని అమెరికా వెళ్లాడు. అమెరికా వెళ్లిన తర్వాత ఒకటి రెండుసార్లు తప్ప మళ్లీ రాలేదు. జయలక్ష్మి తండ్రి చనిపోయినప్పుడు వచ్చి వెళ్లారు. 2009వ సంవత్సరం ఏప్రిల్ నెలలో భార్య జయలక్ష్మిని, పిల్లలు తేజస్విని, శివకుమార్‌ను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆయన భారత్‌కు వచ్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. సంవత్సరాలు గడిచినా లక్ష్మీనివాస్ ఆచూకీ దొరకక పోవడంతో ఇంటర్ పోల్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసు లక్ష్మీ నివాస్ సొంత కృష్ణా జిల్లాకు ఉయ్యూరు పోలీసు స్టేషన్‌కు కూడా చేరుకున్నది. అయితే పోలీసుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోనే లక్ష్మీ నివాస్ ఉన్నప్పటికీ ఆచూకీ కనుక్కోలేక పోతున్నారని జయలక్ష్మి బంధువులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగానే తన సోదరిని హత్య చేసినట్లు జయలక్ష్మి సోదరుడు ఆరోపిస్తున్నారు. లక్ష్మీ నివాస్ రాజధానిలోనే ఉన్నాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సిబిఐని అప్రమత్తం చేసినా ఇప్పటి వరకు ఆయనను పట్టుకోక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.












Click it and Unblock the Notifications