వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఎన్నారైలతో మోహన్ బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
తిరుపతిలో తాను నడుపుతున్న శ్రీ విద్యానికేతన్ గురించి ప్రవాసాంధ్రులకు తెలియజేసే నిమిత్తం ప్రముఖ సినీ నటుడు పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గత మూడు వారాలుగా అమెరికాలోని పలు నగరాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా డెట్రాయిట్‌లో ఏర్పాటు చేసిన సభలో మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణు, సంస్థ ప్రత్యేకాధికారి తుమ్మల గోపాలరావు పాల్గొన్నారు. స్థానిక ప్రముఖులు, అబిమానులు, చిన్నారులతో సాగిన ఈ సభలో దాదాపు 400 మంది పాల్గొన్నారు.

తన జీవన ప్రయాణంలోని ఒడిదొడుకులను గుర్తు చేసుకుంటూ సాగిన మోహన్ బాబు ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అమెరికాలోని పెద్ద విశ్వవిద్యాలయాలను ఆదర్శంగా తీసుకుని, వాటి రీతిలోనే తమ సంస్థను తీర్చిదిద్దాలనే ఆశయాన్ని విష్ణు తన ప్రసంగంలో వెల్లడించారు. ఇందుకు తమకు ప్రవాసాంధ్రుల ప్రోత్సాహం, భాగస్వామ్యం కావాలని కోరారు. ఏటా 25 శాంత మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని, క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా అందరినీ ఉద్యోగావకాశాలకు చేరువ చేస్తున్నామని చెప్పారు.

స్థాపన నుమచి ఇప్పటి వరకు శ్రీవిద్యానికేతన్ సాధించిన ప్రగతిని తెలియజేసే వీడియోను తిలకించిన ప్రవాసాంధ్రులు దాదాపు 115,000 డాలర్ల విరాళాలు అందజేశారు. చిన్న పిల్లలు తమ పాకెట్ మనీ కూడబెట్టి, పది, ఇరవై డాలర్లు కూడా విరాళంగా సమర్పించారు. మోహన్ బాబును, విష్ణును డెట్రాయిట్ తెలుగు సంస్థ జ్ఞాపికలతో గౌరవించింది.

శ్రీవిద్యానికేతన్ సంస్థను తమకు పరిచయం చేసిన సతీష్ మందలప, శివరామ్ యార్లగడ్డ తదితరులను సభకు విచ్చేసినవారు అభినందించారు. కార్యక్రమ నిర్వహణలో తోడ్పడిన వంశీ కారుమంచి, సునీల్ పాంత్ర, గోగినేని (జూ) శ్రీనివాస రావు, మోహన్ కోనేరు, దంతేశ్వరరావు, సాగర్ మారం రెడ్డి, చంద్ర కొంపల్లి, ఉదయకుమార్ చాపలమడుగు తదితరులకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

English summary
Cine star Mohan babu along with his son Vishnu visited USA to get support of NRIs to his Sri Vidyaniketan institute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X