వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సెయింట్ లూయిస్‌లో వైయస్సార్ జయంతి ఉత్సవం

వైయస్ బాల్యం, 60 ఏళ్ల జీవితం, 31 ఏళ్ల రాజకీయ జీవితం వంటి విషయాలతో పాటు పాదయాత్ర, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వంటి అంశాలతో కూడిన ప్రత్యేక వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. అశ్వీర్ రెడ్డి పమ్మి బర్త్ డే కేక్ కట్ చేశారు. వైయస్సార్ సెయింట్ లూయిస్ పర్యటనను సుబ్బారెడ్డి పమ్మి గుర్తు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించి, వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని అభిమానులు కోరుకున్నారు.
గోపాల్ రెడ్డి తాటిపర్తి, సాయికృష్ణా రెడ్డి, చంద్రశేఖర రెడ్డి, కిరణ్ ముల్పూరు, శ్రీకాంత్ తమ తమ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించిన ముల్పూరు ప్రకాష్, సీతలకు కృతజ్ఞతలు తెలిపారు.