డల్లాస్‌లో ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ అభిమానులు పలువురు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. తెలుగు ప్రజల పట్ల, తెలుగు భాష పట్ల ఎన్టీఆర్‌కు గల అభిమానాన్ని నవనీత కృష్ణ వివరించారు. ఎన్టీఆర్‌పై తన అభిమానాన్ని శ్రీనివాస్ రావెల్ల కవితారూపంలో వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఇంకా జీవించి ఉన్నాడని ఆయన అన్నారు. విభిన్న పాత్రలను పోషించి ఎన్టీఆర్ ఏ విధంగా విజయం సాధించాడనే విషయంపై అనంత్ మల్లవరపు వివరించారు. భారత సినీ రంగంలో వంద సినిమాల్లో నటించిన తొలి నటుడు ఎన్టీఆర్ అని ఆయన చెప్పారు.
ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి, మూర్తిమత్వానికి ఎన్టీఆర్ ప్రతీకగా ఎన్టీఆర్ నిలిచారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ ఆదర్శ రాజకీయ నాయకుడు ఎలా అయ్యారనే విషయంపై రాజేష్ వీరపనేనని వివరించారు. తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యం నింపాడని ఆయన అన్నారు. పేద ప్రజల పక్షపాతిగా ఎన్టీఆర్ వ్యవహరించిన తీరును ఇండియా నుంచి వచ్చిన రావు లింగా వివరించారు. పేదల ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని చెప్పారు.
ఎన్టీఆర్ విభన్నమైన పాత్రలను పోషించి, సినిమాల్లో నవరసాలను పండించారని సురేష్ కాజా అన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ అత్యద్భుతమైన వ్యక్తి అని గోపి రెడ్డి చిలుకూరు అన్నారు. దాన వీర శూర కర్ణ సినిమా నుంచి ఎన్టీఆర్ డైలాగులను జ్యోతి వనం వినిపించారు. నందమూరి బాలకృష్ణ ఫోన్‌లో కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం నాయకుడు ఎర్రంనాయుడు కూడా ఫోన్లో మాట్లాడారు.
ఎన్టీఆర్ సినిమాల్లోంచి సాంబ కర్నాటి, జయ కళ్యాణి, సురేష్ పాతనేని మధురమైన పాటలను ఆలపించారు. కార్యక్రమానికి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులకు సతీష్ మండువ కృతజ్ఞతలు తెలిపారు. వెంకట్ కొల్లి, చలపతి రావు కొండ్రుగుంట, శేషారావు బొడ్డు, శ్రీనివాస్ రావెల్ల, కృష్ణ కోరాడ, కృష్ణ మోహన్ అతోటా, సురేష్ మండువ, శ్రీధర్ కోడెల, సతీష్ మండువ, శ్రీధర్ తుమ్మల, సాంబ దొడ్డ, శ్రీనివాస్ కావూరి, శ్రీనివాస్ భావిరెడ్డి, శ్రీకాంత్ పోలవరపు, జ్యోతి వనం, అనంత్ మల్లవరపు, వినోద్ ఉప్పు, సుగుణ్ చాగర్లమూడి, శ్రీనివాస్ కోనేరు, సాయి లింగా, రామ్ తాతినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, సహకారం అందించారు.












Click it and Unblock the Notifications