• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రామచంద్రయ్య అమెరికా ట్రిప్ సక్సెస్

By Pratap
|

C Ramachandraiah
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య స్వయంగా అమెరికా దేశాన్ని చూసి ఇక్కడ తెలుగు వారిని ముఖ్యంగా కొన్ని దేవాలయాలను సందర్సించాలనే సంకల్పంతో ఆగస్టు 10వ తేదీన అమెరికా వచ్చారు.

ప్రథమంగా టెక్సాస్‌లోని డల్లాస్‌లో నిర్వహించిన "సేవ్ టెంపుల్స్" (ఆలయాలను రక్షించండి) అనే నినాదంతో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఆ సభ దిగ్విజయంగా జరిగిన నేపధ్యంలో అన్ని రాష్ట్రాలతోపాటు అన్నపురెడ్డి విజయ్ రెడ్డి ఆహ్వానం మేరకు బాల్టిమోర్ ఎండి వచ్చారు.

మొదటగా అన్నపురెడ్డి విజయ్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, డాక్టర్లు, ఇంజినీర్లు, ఫార్మసిస్ట్ ల సమక్షంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. అన్నపురెడ్డి విజయ్ మాట్లాడుతూ - రామచంద్రయ్య గురించి, ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న దేవదాయ, ధర్మాదాయ శాఖలు గురించి, అంతే కాక సేవ్ టెంపుల్ ప్రాముఖ్యం గురించి వివరించారు. మంత్రివర్యులు తలపెట్టిన కార్యక్రమానికి తనవంతు సహాయాన్ని అందిస్తానని చెప్పారు.

సి. రామచంద్రయ్య మాట్లాడుతూ - ఇది తన మొట్టమొదటి అమెరికా పర్యటనని, ఇంతమంది తెలుగువారిని కలుసుకుని వారి అభిమానాన్ని పొందటం చాలా సంతోషంగా వుందని చెప్పారు. వారి వారి స్వగ్రామాలలో నిర్మించిన దేవాలయాలు, శిథిలావస్థలో వుంటే వాటిని పునరుద్దరించటానికి, పునర్మించటానికి సగభాగం ఎన్నారైలు సమకూర్చగలిగితే మిగతా సగభాగం అంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ నిధులను అందచేసే కార్యక్రమానికి ప్రాతిపదికను తయారు చేసి ప్రభుత్వంతో సంప్రదించి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు.

ఆ మరుసటి రోజు ఆగస్టు 22వ తేదీన చందు శ్రీనివాసరావు, శ్రీనివాస్ శీలంశెట్టి, శ్రీధర్ వన్నెం రెడ్డి, వారి మిత్రులు కలిసి మంత్రిని వాషింగ్టన్ డిసిలోని ముఖ్య ప్రదేశాలను సందర్సించటానికి ఏర్పాటులు చేయటమే కాకుండా అదే సాయంత్రం సి. రామచంద్రయ్య గౌరవార్ధం శివ విష్ణు ఆలయ చైర్మన్ డాక్టర్ సిరం

అధ్యక్షతలో జరిగిన సభకు హాజరయ్యారు. శివ విష్ణు ఆలయ సిబ్బంది మంత్రికి వేద మంత్రాలతో ఘనస్వాగతం పలికారు. ఆ పిమ్మట సరాసరి ఎల్లికాట్ సిటీలోని ఫ్యారడైజ్ రెస్టారెంట్‌లో చందు శ్రీనివాసరావు, శ్రీనివాస్ శీలంశెట్టి, శ్రీధర్ వన్నెమరెడ్డి వారి మిత్రులతో కలిసి ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొన్నారు.

దాదాపు వందకు పైగా తెలుగు కుటుంబాలు మంత్రికి ఘనస్వాగతం పలికారు. చందు శ్రీనివాసరావు మంత్రిని, డాక్టర్ సిరంని, వారితో పాటు అన్నపురెడ్డి విజయ్‌ని, కొండా రామ్మొహన్, ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ జనిత కంచెర్లని, వైయస్సార్ కృష్ణయ్యని వేదిక మీదకు సాదరంగా ఆహ్వనించారు. చందు శ్రీనివాసరావు మట్లాడుతూ - సి. రామచంద్రయ్య గారు రాష్ట్ర ప్రజలకు అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ, మంత్రిని సత్కరించవలసిందిగా శ్రీనివాస్ శీలంశెట్టిని కోరారు.

శ్రీనివాస్ శీలంశెట్టి సి. రామచంద్రయ్యని షాలువా, పుష్ప గుచ్చాలతో సత్కరించగా, డాక్టర్ సిరం గారిని శ్రీధర్ వన్నెమరెడ్డి, జనిత గారిని రాజేష్ సుంకర, వైయస్సార్ కృష్ణయ్యని అమృతం క్రిష్ణమోహన్, అన్నపురెడ్డి విజయ్‌ని వెంకట్ వుండమట్ల, రామ్మోహన్ ని గంగాధర్ చందు పుష్పగుఛ్చాలతో అభినందించారు.

ఆటా కార్యదర్సి కొండా రామ్మొహన్ మాట్లాడుతూ - మేరీలాండ్ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంబంధాలకు సహకరించవలసిందిగా మంత్రిని కోరారు. ప్రముఖ సినీ రచయిత, నటుడు డైరెక్టర్ శ్రీ ఎస్వీ సుబ్బారావు మంత్రి తలపెట్టిన కార్యక్రమం చాలా ఆదర్సవంతమైనదని కొనియాడారు. చివరగా సి. రామచంద్రయ్య

మట్లాడుతూ - ఆంద్ర లో శిథిలావస్థలో వున్న ఆలయాల పునరుద్ధరణకు ఎన్నారైలు స్పందించి నడుం కట్టాలని కోరుతూ, కొంత మంది వారి వారి గ్రామాలలో వున్న దేవాలయాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఇదే రోజు డా. చిరంజీవి పుట్టినరోజు యాదృచ్ఛికం కావటంతో, చిరంజీవి అభిమానుల కోరిక మేర, చిరంజీవి తరఫున సి. రామచంద్రయ్య అభిమానుల హర్షధ్వనుల మధ్య "కేక్" కట్ చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులైన శ్రీనివాస్ శీలంశెట్టి, శ్రీధర్ వన్నెం రెడ్డి, వెంకట్ వుండమట్ల, మధు దాసరి, రాజేష్ సుంకర,గంగాధర్ చందు, శ్రీనివాసులు నగరూరు, రాజెష్ అంకం, మారుతి కంభంపాటి, సాగర్ కంది, సురేష్ నరహరిశెట్టి, సురేష్ గడ్డెం, వెంకట్ వారణాసి, రాం రెడ్డి, కిషోర్, ప్రసాద్ నరహరిశెట్టి, చిన్న గూడపాటి, గౌడ్, క్రిష్ణమోహన్ అమృతం లు తమ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

చివరగా శ్రీనివాస్ శీలంశెట్టి, ఈ సభకు విచ్చేసిన ప్రతివుక్కరికి మరిముఖ్యంగా శ్రీ సి. రామచంద్రయ్య, డాక్టర్ సిరంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తూ వందన సమర్పన చేశారు. అనంతరం తెలుగు వంటకాలతో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. మరుసటి రోజు ఆగస్టు 23వ తేదీన అన్నపురెడ్డి విజయ్ సి. రామచంద్రయ్యని మేరీలాండ్ గవర్నర్ మార్టిన్ ఓ మాల్లేతో మీటింగ్ ఏర్పాటు చేసి, అనంతరం ఏర్పాటు చేసిన అల్ఫాహార విందులో పాల్గొన్నారు.

English summary

 Andhra Pradesh endowment minister C Ramachandraiah has visted USA recently and appealed Telugu NRIs to contribute to renovate temples in the state. He participated in Sabe Temples programmes orgnised in USA
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X