పుణ్యానికి పోయి గాయపడ్డాడు

సంజయ్ జైస్వాల్ అనే ఎన్నారై వ్యాపారవేత్త తన బంధువుతో కలిసి ముంబైలోని బాంద్రా - కుర్లాలో నడుస్తూ వెళ్తున్నాడు. ఈ సమయంలో కారు డ్రైవర్ బేస్‌బాల్ బ్యాట్‌తో ఓ మోటరిస్టును కొడుతుండడం కనిపించింది. ఉండబట్టలేక, తన దారిన తాను వెళ్లకుండా వారిద్దరి మధ్య గొడవలో జోక్యం చేసుకుని చల్లార్చే ప్రయత్నం చేశారు.
దాంతో ఆ వ్యక్తి సంజయ్ వైపు తిరిగి ఆదే బేస్‌బాల్ బ్యాట్‌తో చావమోదాడు. దాంతో సంజయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతను ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు.
సంజయ్‌పై దాడి చేసిన ఇంద్రజిత్ సావంత్ అనే వ్యక్తిని హత్యాప్రయత్నం కింద అరెస్టు చేశారు. నిందితుడు కారు, రిషీ గాంధీ అనే ఎగ్జిక్యూటివ్ వాహనం పరస్పరం ఢీకొట్టుకోవడంతో ఘర్షణ ప్రారంభమైందని పోలీసులు చెప్పారు. సావంత్‌కు జూన్ 12వ తేదీ వరకు రిమాండ్ విధించారు.












Click it and Unblock the Notifications