కువైట్‌లో తమిళుడి మృతి

కోస్టర్ బస్సులో కంపెనీ సిబ్బందిని కార్యాలయం వద్ద దింపేసి తిరిగి వస్తుండగా అతను దుర్మరణం పాలయ్యాడు. అతను నడుపుతున్న కోస్టర్ బస్సు సైన్ బోర్డును ఢీకొట్టింది. దాంతో వెంటనే మంటలు లేచాయి. ఆ మంటల నుంచి అతను తప్పించుకోలేకపోయాడు.
అతను తమిళనాడులోని విరుద్ధనగర్ జిల్లా సత్తూరు తాలూకాలోని రామలింగరపురం గ్రామానికి చెందినవాడు. అతని వివరాలను, ప్రమాదానికి సంబంధించిన ఛాయాచిత్రాలను, అతని ఫోటోను లారెన్స్ గ్లాడీ ఇ - మెయిల్ ద్వారా పంపించారు. లారెన్స్ గ్లాడీ పనిచేస్తున్న సంస్థలోనే ఆండి రెడ్డియార్ చంద్రన్ పనిచేస్తున్నాడు.












Click it and Unblock the Notifications