స్వస్థలాలకు చేరిన టెక్కీల మృతదేహాలు

అక్కడి నుంచి అంబులెన్స్‌లో వారివారి స్వస్థలాలకు తరలించారు. ఈ నెల 10వ తేదీన అమెరికాలోని ఓక్లహామా అంతర్రాష్ట్ర రహదారిపై జరిగిన ప్రమాదంలో అంతటి అనురాగ్ (27), రావికంటి శ్రీనివాస్ (28), గాదె ఫణీంద్ర (28), వెంకట్ రవి (29) మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరి మృతదేహాలను ఇక్కడికి తరలించడానికి తానా వారు ఆర్థిక సహాయం అందించారని కుటుంబసభ్యులు తెలిపారు.
ఎన్నో కలలతో దేశంకాని దేశం వెళ్లిన తమవారు ఇలా తిరిగి వస్తారని కల్లో కూడా అనుకోలేదంటూ వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడు రోడ్డు ప్రమాదంలో కోల్పోవటాన్ని జీర్ణించులేక పోతున్నామని అనురాగ్ తండ్రి వెంకటేశ్వరరావు భోరుమన్నారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన మరో యువకుడు రావికంటి శ్రీనివాస్ మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన సొంతూరైన గోదావరిఖనికి తరలించారు.












Click it and Unblock the Notifications