దుబాయ్‌లో వనభోజనాల సందడి
దుబాయ్: వాసవీ కృప వారి సౌజన్యంతో దుబాయ్‌లో జబీల్ పార్క్ గెట్ నెంబర్ -6లో శుక్రవారం నవంబర్ 23వ తేదీ ఉదయం9గంటలకు వైభవంగా ప్రతిష్టాత్మకమైన కార్తీక మాసం వనభోజనాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది ఆర్యవైశ్యులు బంధుమిత్ర సపరివారంగా హాజరయ్యారు.

కార్తీక మాసం ప్రాశస్త్యాన్ని, వనభోజనాల నిర్వహణ గురించి వివరిస్తున్న కమిటీ సభ్యులు

కార్తీక మాసం వనభోజనాల సందర్భంగా ఇలా ఉత్సాహంగా ఆటపాటలతో గడిపారు.

దుబాయ్‌లోని ఎన్నారైలు ఆంధ్ర వంటకాల రుచిని అత్యంత ప్రీతిపాత్రంగా ఆరగిస్తున్న దృశ్యం.

వనభోజనాల సందర్బంగా ఎన్నారైలు ఇలా కలిసిపోయి, మాటా ముచ్చటతో సంతోషంగా గడిపారు.
"వాసవీ కృప వనభోజన మహూత్సవంలో" పాల్గొని ఎంతో ఉత్సాహంతో కేరింతలు కొడుతూ దివ్య శోభయామానంగా కార్యక్రమాన్నిజయప్రదం చేశారని వాసవి కృప నిర్వాహకులు తెలిపారుయ సంప్రదాయానికి అనుగుణంగా వాసవి కృప కమిటీ సభ్యులు ఆంధ్ర వంటకాలతో విందును ఏర్పాటుచేశారు.












Click it and Unblock the Notifications