లండన్‌లో 'వొడవని ముచ్చట' ఆవిష్కరణ

Vodavani Muchata released in London
లండన్: ప్రొఫెసర్ జయశంకర్ జీవిత చరిత్ర, అనుభవాలతో కూడిన వొడవని ముచ్చట పుస్తక ఆవిష్కరణ లండన్‌లో జరిగింది. తెలంగాణ సాహిత్య సంబంధమైన పుస్తకం లండన్‌లో ఆవిష్కరణ జరుపుకోవడం ఇదే మొదటిసారి. తెలంగాణ ఎన్నారై ఫోరం (తెనా) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కొంపెల్లి వెంకట్ ఈ పుస్తకాన్ని రచించారు. పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్ మాట్లాడారు. ఈ పుస్తకం తెలంగాణ ప్రజానీకానికి స్ఫూర్తిదాయకమని, సాహిత్య ఉద్యమానికి తోడ్పడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక, సాహిత్యాలు అగ్రభాగాన పనిచేస్తాయని ఆయన అన్నారు.

పుస్తక ఆవిష్కరణ లండన్‌లో జరగడం సంతోషదాయకమని తెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా ప్రతినిధి పవిత్ర రెడ్డి అన్నారు. ఈ అమూల్యమైన పుస్తకాన్ని అందరూ చదవాలని ఆమె పిలుపునిచ్చారు. జయశంకర్ జీవిత విశేషాల సారాంశం, అహింసామార్గం, సహనం, సాధనలక్ష్యం, ఐక్యతా ఆకాంక్షను ఈ పుస్తకం చాటుతుందని తెలంగాణ ఎన్నారై ఫోరం సభ్యుడు కూర్మాచలం అన్నారు.

ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి, నగేష్, చందూగౌడ్, వెంకట్ రాజు, అశోక్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌తో రోజుల తరబడి కూర్చుని మాట్లాడి, ఆయన మాటలను కొంపెల్లి వెంకట్ రికార్డు చేసి వొడవని ముచ్చట గ్రంథాన్ని రచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+