దామోదరం సంజీవయ్య జయంతి

Damodharam Sanjeevaiah 92 Birthday celebrations in Washington DC, USA
వాషింగ్టన్ డిసి: అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో దామోదరం సంజీవయ్య 92వ జయంతి జరిగింది. దామోదరం సంజీవయ్య ట్రస్టు ఆధ్వర్యంలో ఈ జయంతి కార్యక్రమం జరిగింది. పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ పార్లమెంటు సభ్యుడు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కెఎస్ఆర్ మూర్తి ఫోన్ ద్వారా ప్రసంగించారు.

దామోదరం సంజీవయ్య జీవిత చరిత్రను, ఆయన చేసిన సేవలను కెఎస్ఆర్ మూర్తి వివరించారు. భారత దేశ అభివృద్ధిలో ఎన్నారైలు ఎలా పాత్ర వహించవచ్చునో, పేదరిక నిర్మూలనకు ఎలా కృషి చేయవచ్చునో కూడా ఆయన వివరించారు. పవన్ గిర్లా సమావేశానికి అధ్యక్షత వహించారు.

సంజీవయ్య నిస్వార్థ సేవను, అవినీతిరహిత వ్యక్తిత్వాన్ని ఆయన ప్రశంసించారు. వ్యక్తిత్వం ఉన్న నాయకుడిగా ఆయన అభివర్ణించారు. సంజీవయ్య వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ఆయన ఓ సంఘటనను ఉదహరించారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత సంజీవయ్య కారులో కాకుండా రిక్షాలో తన ఇంటికి వెళ్లిపోయారని ఆయన చెప్పారు. ప్రస్తుతం అటువంటి నాయకుడు కనిపించడం లేదని, రాజకీయాల పట్ల ఆసక్తి గలవాళ్లు సంజీవయ్యను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

భారతదేశం రెండు సమస్యలతో సతమతమవుతోందని, ఒకటి అవినీతి కాగా, రెండోది నిరుద్యోగమన, ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనదేశంలో ఉన్న యువతను ప్రోత్సహించాలని బుచ్చన్న గాజుల అన్నారు. సంజీవయ్య సాధించిన విజయాలను కిశోర్ తంగేటి వివరించారు. మల్లిక్ కూడా సంజీవయ్య గురించి మాట్లాడారు. సంజీవయ్య జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని సమావేశం కోరింది.

శ్రవణ్, ఈశ్వర్, శ్రీధర్, అజయ్, శ్రీనివాస్, మల్లిక్, కృష్ణ, రవి బొజ్జ, రాజు, శ్రీనివాస్ పాశం, పవన్, హరి, వెంకట్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+