ఢిల్లీలో మేమే: ఆమ్ ఆద్మీ పార్టీ

కింగ్ ఆఫ్ ప్రష్యా: రానున్న ఢిల్లీ శానససభ ఎన్నికల్లో క్రీడా నిబంధనలను తమ పార్టీ మారుస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ అన్నారు. ఫిలడెల్ఫియా ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ప్రసంగించారు. దేశంలో నిస్పృహ పెచ్చరిల్లుతోందని, దాన్ని అడ్జగించాలన్సిన బాధ్యత పౌరులపై ఉందని ఆనంద్ కుమార్ అన్నారు.

మంచి వ్యక్తులు రాకపోతే రాజకీయాలు దుర్మార్గుల చేతుల్లోకి వెళ్తాయని, అందువల్ల రాజకీయాలపై చెడు అభిప్రాయం ఏర్పడుతోందని ఆయన అన్నారు. వేలాది ఏళ్లు భారతదేశం పరాయి పాలనలో ఉందని, దాన్ని ప్రజలు రాజకీయాల్లోకి రావడం ద్వారా మార్చారని ఆయన అన్నారు.

Delhi Elections will be fought on the Agenda set by Aam Aadmi Party

గాంధీ ఆధ్యాత్మికతను, సన్మార్గాన్ని రాజకీయాలకు జోడించి గాంధీ ప్రజలను చైతన్యపరిచారని, అందరూ రాజకీయ రంగంలో పాలు పంచుకోవాలని సూచించారని ఆయన అన్నారు. పాలన, అభివృద్ధి, హేతుబద్ధత, ప్రజాస్వామ్యం వంటి విషయాల్లో లోపాలున్నాయని, ప్రజలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అవి మారుతాయని అన్నారు. వ్యవస్థలో లోపాలకు రాజకీయ నాయకులను మనం నిందిస్తామని, కానీ పౌరసత్వంలో లోపాలకు వారిని నిందించలేమని, మనం ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఒకటి, రెండు తప్ప మిగతా జాతీయ, ప్రాంతీయ పార్టీలు తప్ప అన్ని పార్టీలు బంధుప్రీతికి ఆలవాలంగా మారాయని, సోమ్ము చేసుకుంటున్నాయని, ప్రజా సేవ చేయడం లేదని ఆనంద్ కుమార్ అన్నారు. నేరాలకు, రాజకీయాలకు మధ్య సంబంధం వల్ల ప్రజాస్వామ్యం స్తంభించిందని చెప్పారు. ధన, భుజ, మీడియా బలాలను ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కుంటుందని చెప్పారు. పార్లీలోనూ, బయటా తమ పార్టీ పారదర్శకతను, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పారు.

దేశంగా భారత్ మనుగడ సాగించలేదని 1947లో అంచనా వేశారని, ప్రస్తుత స్థితిని చూస్తే అందులోని వాస్తవం తెలిసి వస్తుందని డాక్టర్ యాదవ్ అన్నారు. దేశాన్ని ముందుకు నడిపించడంలో మన నాయకత్వం విఫలమైందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య పోరాటాన్ని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లడానికి బదులు చిన్న విషయాలకు పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు.

భారతదేశ స్ఫూర్తి ఇంకా సజీవంగా ఉందని, అన్నా ఉద్యమం ఆ స్ఫూర్తికి సంకేతమని ఆయన అన్నారు. రాజకీయాలకు వెలుపల ఉండి అవినీతి గురించి మాట్లాడుతున్నావంటే అతి చిన్నపాటి అవినీతి గురించి మాట్లాడుతున్నావని అర్థమని, రాబర్ట్ వాద్రా, యడ్యూరప్ప, ప్రమోద్ మహాజన్, మాయావతి, లాలూ ప్రసాద్ అవినీతి గురించి కాదని అన్నారు. తమ పార్టీ నిర్దేశించి ఎజెండా మీదనే ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు. తమ పార్టీ ఆట నిబంధనలను మార్చేస్తుందని అన్నారు.

ఈ సమావేశాన్ని రవి మేరెడ్డి, మాధవ్ మోసర్ల, సుమంత్ గరకరాజుల, ప్రభాకర్ పరాగ్త వినోద్ ఏర్పాటు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ న్యూజెర్సీకి చెందిన హిమాంశు, జయేష్, బోస్టన్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుమన్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+