వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో 'విశాలంధ మహారభస'

By Pratap
|
Google Oneindia TeluguNews

Visalandhra Maha Rabhasa released
లండన్: ప్రముఖ రచయిత, జర్నలిస్టు ఎన్ వేణుగోపాల్ రసిన విశాలాంధ మహా రభస పుస్తకాన్ని తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో సోమవారం లండన్‌లో ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంపై పరకాల ప్రభాకర్ చేసిన వాదనలను తిప్పికొడుతూ వేణుగోపాల్ ఈ పుస్తకం రాశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

నిజానికి అజ్ఝానుల అసత్య ప్రచారానికి జవాబు చెప్పకూడదని తాను అనుకున్నానని, అయితే, చరిత్ర పుటల కోసం తప్పని పరిస్థితిలో జవాబు ఇవ్వాల్సి వచ్చందని వేణుగోపాల్ అన్నారు. ఎప్పటికప్పుడు సమాధానాలు చెప్పలేని కొత్త ప్రశ్నలు అంటూ అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలని ఆయన సూచించారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం కోర్ మెంబర్ ఉదయ్ నాగరాజు అధ్యక్షతను ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ శివాజీ షిండే మాట్లాడారు. ఎన్నో పుస్తకాలు చదివితే ఇంత జ్ఝాన సముపార్జన సాధ్యం కాదని ఆయన అన్నారు. సాహిత్య ఉద్యమం ఏ పోరాటానికైనా పునాది అని అన్నారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపకులు గంప వేణుగోపాల్, అనిల్ కూర్మాచాలం, మహిళా విభాగం ప్రతినిధ్ అర్చన జువ్వాడి, కోర్ మెంబర్లు రంగు వెంకట్, ప్రమోద అంతరి, చందు గౌడ్ సిక్క, నవీన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
Telangana NRI forum has released Vishalandha maha Rabhasa book written by a journalist from Telangana N Venugopal in London.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X