మోసం: దోషులుగా తేలిన ముగ్గురు ఎన్నారైలు
న్యూయార్క్: ఆరోగ్య బీమా పేరిట భారీ కుంభకోణానికి పాల్పడిన ముగ్గురు భారతీయులను అమెరికా ఫెడరల్ జురీ దోషులుగా నిర్ధారించింది. 2008 జులై నుంచి 2011 సెప్టెంబర్ మధ్యకాలంలో చోటు చేసుకున్న సుమారు 15 మిలియన్ డాలర్ల కుంభకోణంలో వీరి పాత్ర ఉందని తేల్చింది.
వైద్య వృత్తిలో కొనసాగుతున్న షహజాద్ మీర్జా, జిగర్ పటేల్ అనే వ్యక్తులతోపాటు వైద్యుడిగా ప్రాక్టీస్ చేయడానికి తగిన అర్హత(లైసెన్స్) లేని శ్రీనివాసరెడ్డి అనే మరో వ్యక్తికి ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయిందని అసిస్టెంట్ అటార్నీ జనరల్ డేవిడ్ ఏ ఓనేల్ పేర్కొన్నారు.

ఆరోగ్య బీమా సంస్థకు వీరు తప్పుడు క్లెయిమ్‌లు సమర్పించారని ఆయన తెలిపారు. వీరిలో శ్రీనివాసరెడ్డి రోగుల ఇళ్లకు వెళ్లి వైద్యం అందించినట్లు తప్పుడు క్లెయిమ్‌లు సమర్పించారని చెప్పారు.
షహజాద్ మీర్జా, జిగర్ పటేల్ వైద్య సేవలు అందించకుండానే తప్పుడు క్లెయిమ్‌లతో నిధులు రాబట్టుకునేవారని తెలిపారు. ఇందులో పటేల్ ఎంఐ హెల్త్‌కేర్ అనే తన సంస్థ ద్వారా మోసాలకు పాల్పడ్డారని డేవిడ్ ఏ ఓనేల్ చెప్పారు. వీరు ముగ్గురు దాదాపు 15 మిలియన్ డాలర్ల కుంభకోణానికి పాల్పడ్డారని తెలిపారు.












Click it and Unblock the Notifications