NRI News: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన తల్లీకూతుళ్ల మృతి..
అమెరికాలోని పోర్టుల్యాండ్ లో విషాదం నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున పోర్టుల్యాండ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలుగు మహిల తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. కాగా ఇదే రోడ్డు ప్రమాదంలో మృతిరాలి కుమార్తె తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే కన్నుమూసింది.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచి గ్రామానికి చెందిన కమతం నరేష్ ఆయన భార్య గీతాంజలి అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి ఆరు సంవత్సరాల కూతురు హీనిక, మూడేళ్ల కుమారుడు బ్రమణ్ ఉన్నాడు. ఆదివారం వీరి కుటుంబం పనిపై కారులో బయటకు వెళ్లింది. కారును నరేష్ డ్రైవ్ చేస్తున్నాడు. వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో కుమార్తె హానిక అక్కడిక్కకడే మృతి చెందింది.

నరేష్, బ్రమణ్ స్వల్పంగా గాయపడగా.. గీతాంజలి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురిని స్థానికి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నరేష్, బ్రమణ్ కోలుకుంటుండగా.. గీతాంజలి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూసినట్లు తెలిసింది. ఈ రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి చెందడంతో కొణకంచిలో తీవ్ర విషాదం నెలకొంది. గీతాంజలి, ఆమె కూతురు హానిక మృతదేహాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గీతాంజలి పుటిన్న రోజు సందర్భంగా బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరగడం, ఆమె కుమార్తె కూడా ఇదే ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా గీతాంజలి కుటుంబ గుడికి వెళ్లి వస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications