NRI News: అమెరికాలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్..
విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు తరుచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థులు హత్యకు గురికావడం, లేదా కిడ్నాప్ కు గురికావడం జరుగుతోంది. తాజాగా చికాగోలో భారతీయ విద్యార్థి కిడ్నాప్ కు గురయ్యాడు.
వారం రోజుల నుంచి తెలంగాణకు చెందిన చింతకింది రూపేశ్ చంద్ర కనిపించకుండా పోయాడు. మే 2 నుంచి అతను కనిపించడం లేదని చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
రూపేశ్ ఆచూకి కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. రూపేష్ ఆచూకి తెలిస్తే సమాచారం అందంచాలని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. రూపేష్ చికాగోలోని ఎన్ షెరిడాన్ రోడ్ 4300 బ్లాక్ నుంచి తప్పిపోయినట్లు తెలిసింది. అతను స్వస్థలం హన్మకొండ. ప్రస్తుతం రూపేశ్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు.

రూపేశ్ అదృశ్యమైన విషయం అతని తల్లిదండ్రలు తెలిసింది. దీంతో అతని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తమ కొడుకును రక్షించాలని అతని తల్లిదండ్రులు భారత విదేశాంగ శాఖను కోరారు. రూపేశ్ అదృశ్యంపై స్థానిక నాయకులు దృష్టికి తీసుకెళ్లారు. ఏప్రిల్ లో న్యూయార్క్‌లో భారతీయ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో చనిపోయాడు.
The Consulate is deeply concerned learning that Indian student Rupesh Chandra Chintakindi is incommunicado since 2nd May. Consulate is in touch with the police and the Indian diaspora hoping to locate/reestablish contact with Rupesh.@IndianEmbassyUS @MEAIndia
— India in Chicago (@IndiainChicago) May 8, 2024
భారత కాన్సులేట్ శుక్రవారం ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో ఉన్న ఉమా సత్యసాయి గద్దె మరణించాడు. అతని మరణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 2024లో యుఎస్‌లో కనీసం 11 మంది భారతీయ, భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు చనిపోయారు. వీరింతా 25 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు.












Click it and Unblock the Notifications