NRI News: ఏజెంట్ చేతిలో మోసపోయిన యువకులు.. లావోస్ లో అష్టకష్టాలు..!
చాలా మంది స్థానికంగా ఉపాధి దొరక్క విదేశాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాలతో పాటు పలు దేశాలకు ఉపాధి కోసం వెళ్తారు. ఈ క్రమంలోనే కొంత మంది ఏజెంట్ల చేతిలో మోసపోతారు. ఇలానే ఓ ఏజెంట్ చేతిలో మోసపోయిన యువకులు ఎట్టకేలకు స్వదేశం చేరుకున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన కొంత మంది యువకులకు వంశీ అనే వ్యక్తి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాడు. లావోస్ డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఉన్నాయని.. జీతం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పాడు.
ఇది నమ్మిన నలుగురు యువకులు లావోస్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీసా కోసం రూ.2 లక్షలు చెల్లించాలని వంశీ అడిగాడు. దీంతో వారంతా వంశీకి రూ.2 లక్షలు ఇచ్చారు. వంశీ వారికి వీసాతో పాటు టికెట్ కూడా ఇచ్చాడు. వారంతా లావోస్ వెళ్లారు. నలుగురు యువకులను లావోస్‌లోని ఓ కంపెనీలో బిట్ కాయిన్ సెల్స్ అండ్ ప్రమోటింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అయితే వారు చేసేది డేటా ఎంట్రీ ఉద్యోగం కాదని తెలుసుకున్నారు. వారంతా సైబర్ నేరాలు చేయాలని కంపెనీ బాస్ చెప్పడంతో షాకయ్యారు.

వీరంతా ఆన్ లైన్ లో పలువురి కాల్ చేసి మోసం చేయాలని కంపెనీ వారు చెప్పడంతో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. దీంతో వారంతా ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ కంపెనీ వారు వారిని ఇండియాకు పంపేందుకు అనుమతించలేదు. దీంతో వారంతా స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి సహాయంతో భారత్ కు చేరుకున్నారు. అక్టోబర్ 7న హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ చేరుకున్న వారు జగిత్యాలకు వచ్చారు.
తమను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లావోస్ తీవ్ర కష్టాలు పడినట్లు వారు తెలిపారు. నాలుగు రోజులు తిండి లేక పస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే వారు అన్ని తెలుసుకుని వెళ్లాలని సూచించారు.












Click it and Unblock the Notifications