NRI News: 2.5 లక్షల మంది యువతపై వేలాడుతున్న వీసా కత్తి..!
చాలా మంది భారతీయులు చదువు, ఉద్యోగం కోసం అమెరికా వెళ్తున్నారు. ఈ క్రమంలో అమెరికా వెళ్తోన్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. చదువు కోసం వెళ్లిన వారు దాదాపుగా అక్కడ ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. కొంత మంది ఉద్యోగం కోసం హెచ్-1బీ వీసాపై అమెరికా వెళ్తోన్నారు. అయితే వారు వారి పిల్లల్ని కూడా అమెరికా తీసుకెళ్తున్నారు. అయితే హెచ్-1బీ వీసా ఉన్న తల్లిదండ్రుల పిల్లలకు 21 నిండగానే.. దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి పిల్లలు అమెరికాలో 2.5 లక్షల మంది ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు వీరి మీద వీసా కత్తి వేలాడుతోంది. అమెరికా నిబంధనలతో వీరు యూఎస్ ను వీడాల్సి వస్తుంది. కాంగ్రెస్ లో చట్టమో, తీర్మానామో చేయడం ద్వారా వీరిని రక్షించవచ్చని మంది రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల సెనెటర్లు అక్కడి ప్రభుత్వానికి లేఖ రాశారు. హెచ్-1బీ వీసా ఉన్న తల్లిదండ్రులకు వారి పిల్లలు అమెరికా తీసుకెళ్లడానికి తాత్కాలికంగా అనుమతి ఇస్తారు. అయితే ఈ ఆ పిల్లలు 21 ఏళ్లు రాగానే దేశం విడిచి పోవాలి.

ఒక వేళ వారు అక్కడ ఉండాలనుకుంటే వారి తల్లిదండ్రులకు గ్రీన్ కార్డు రావాల్సి ఉంటుంది. అంటే హెచ్-1బీ వీసా వెళ్లిన తల్లిదండ్రులు వారి పిల్లలకు 21 సంవత్సరాలు వచ్చే వరకు గ్రీన్ సంపాదించాలి. లేకుంటే వారి పిల్లలను ఇండియా పంపించాల్సిందే. తల్లిదండ్రులకు గ్రీన్‌కార్డు రాకుంటే వారి తాత్కాలిక డిపెండెంట్ వీసా రద్దు అయిపోతోంది. 21 ఏళ్లు నిండిన పిల్లలు అక్కడే ఉండాలంటే.. తాత్కాలిక వీసాకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
పలు మీడియా కథనాల ప్రకారం 2023 నవంబరు చివరి నాటికి 10 లక్షల మందికి పైగా భారతీయులు గ్రీన్‌కార్డు కోసం ఎదురు చుస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications