NRI News: మానవ అక్రమ రవాణా కేసులో కీలక నిందితుడిగా హైదరాబాదీ..!

మానవ అక్రమ రవాణా అనుమానంతో గత వారం 303 మంది భారతీయులతో నికరాగ్వా వెళ్లే విమానాన్ని ఫ్రాన్స్‌లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ విమానం వాట్రీ విమానాశ్రయం నుంచి తిరిగి ఇండియాకు రానుంది. ఈ విషయంపై ఫ్రాన్స్ దర్యాప్తు ప్రారంభించింది. ఇండియాలోని గుజరాత్ లో నుంచి మానవ అక్రమ రవాణా కేసుకు సంబంధించిన కీలక నిందితుడు హైదరాబాద్ కు చెందిన శశికిరణ్ రెడ్డిగా భావిస్తున్నారు.

గత ఏడాది డింగూచా కేసులో కూడా కీలక నిందితుడిగా భావిస్తున్న శశికిరణ్‌రెడ్డిపై సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయలేకపోయారు. వాట్రీ విమానాశ్రయం నుంచి ఇండియాకు వచ్చిన ఎయిర్‌బస్ A340లో ప్రయాణిస్తున్న వారిలో 96 మంది గుజరాత్‌కు చెందినవారని ఓ వార్త సంస్థ పేర్కొంది. 2022లో డింగుచా కేసు నమోదు అయింది. గత జనవరిలో ఒక కుటుంబంలోని నలుగురు సభ్యులు- జగదీష్ పటేల్ (39), వైశాలి పటేల్ (37), వారి ఇద్దరు పిల్లలు విహంగీ పటేల్ (11), ధార్మిక్ పటేల్ (3) కెనడాలోని ఎమర్సన్ సమీపంలో శవమై కనిపించారు.

 Hyderabadi as key accused in human trafficking case

వీరంతా గుజరాత్‌లోని డింగుచా గ్రామానికి చెందిన పటేళ్లుగా గుర్తించారు. వీరు కెనడా నుంచి అక్రమంగా అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించి చనిపోయారు. వీరు కెనడాలోకి అక్రమంగా ప్రవేశించడానికి జగదీష్ సోదరుడు మహేంద్ర సహకరించినట్లు తెలిసింది. మహేంద్ర శశికిరణ్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నారని, వారు గుజరాత్‌ నుంచి వేలాది మందిని అమెరికాకు పంపారని ఆరోపణలు ఉన్నాయి.

శిశికిరణ్ రెడ్డి.. జగదీష్, అతని కుటుంబ సభ్యుల పత్రాలను సిద్ధం చేశాడని..US సరిహద్దును దాటడానికి సహాయం చేయడానికి ఆఫ్‌షోర్ మానవ స్మగ్లర్‌లతో సమన్వయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. శశికిరణ్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడని, దుబాయ్ నుంచి నికరాగ్వాకు విమానాలను ఏర్పాటు చేస్తున్నాడని వార్త సంస్థ పేర్కొంది. ఇక్కడి నుంచి ప్రజలను అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లారని కూడా వివరించింది.

గత శుక్రవారం ఫ్రాన్స్‌లో నిలిచిపోయిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A340 లో విమాన ప్రయాణికులను రెండు రోజుల పాటు ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+