మహాత్మగాంధీ మెమోరియల్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Subscribe to Oneindia Telugu

డల్లాస్: మహాత్మగాంధీ మెమోరియల్ ప్లాజా వేదికగా జరిగిన భారత 68వ గణతంత్ర దినోత్స వేడుకల్లో వందలాది మంది ఇండియన్స్ పాల్గొన్నారు. మహాత్మ గాంధీ మెమోరియల్ బోర్డు డైరెక్టర్స్ కూడా వేడుకల్లో పాల్గొన్నారు.

వేడుకల్లో భాగంగా మహాత్మగాంధీ మెమోరియల్ నార్త్ టెక్సాస్ సెక్రటరీ రావు కల్వల మాట్లాడారు. వేడుకలకు వేదికగా నిలిచిన సిటీ ఆఫ్ ఇర్వింగ్ తో పాటు నగరానికి గుండెకాయ లాంటి మెట్రోప్లెక్స్ లో గాంధీ మెమోరియల్ స్థాపించడానికి సహకరించినవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. వేడుకలకు హాజరైనవారిని ఈ నెల 30న నిర్వహించే గాంధీ 69వ వర్థంతికి రావాల్సిందిగా కోరారు.

India’s 68th Republic Day celebrations at Mahatma Gandhi Memorial in Dallas, TX.

బోర్డు డైరెక్టర్ జాన్ హామండ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేయగా.. చైర్మన్ ప్రసాద్ తోటకూర త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేశారు. వేడుకలకు హాజరైనవారు గౌరవ వందనం చేశారు.

పతాకవిష్కరణ అనంతరం ప్రసాద్ తోటకూర ప్రసంగించారు. 'రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మహాత్మాగాంధీ లాంటి స్వాతంత్ర్య సమరయోధుల కృషి వల్ల ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చింది.'

' ఆ తర్వాత దేశానికి స్వంత రాజ్యాంగం రూపొందించుకోవడానికి మరో రెండున్నర సంవత్సరాలు పట్టింది. రాజ్యాంగ కమిటీకి డా. అంబేడ్కర్ సారథ్యం వహించారు. అంబేడ్కర్ కృషి వల్ల జనవరి 26, 1950నుంచి మనకు రాజ్యాంగం అందుబాటులోకి వచ్చింది. కుల, మత, వర్గ, స్థాయి బేధం లేకుండా ప్రతీ ఒక్కరు రాజ్యాంగాన్ని అనుసరించాలి' అని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Many hundreds of Indian American community from all age groups, Mahatma Gandhi Memorial of North T
Please Wait while comments are loading...