బాలుడిపై లైంగిక దాడికి కటకటాలు

బాధిత బాలుడు కూడా భారతదేశానికి చెందినవాడే. రిఫా నగరంలోని దుకాణంలో బాలుడిపై అతను లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినట్లు గల్ఫ్ డైలీ న్యూస్ రాసింది. బాలుడు పెరుగు కొనడానికి దుకాణానికి వచ్చాడు. దాంట్లో ఉన్న ఉద్యోగి బాలుడి దుస్తులు ఊడదీసి, అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. బాలుడు తన తండ్రికి విషయమంతా చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, కుటుంబం ఆ తర్వాత తన ఆరోపణలను వెనక్కి తీసుకుంది. అయితే, కోర్టు మాత్రం విచారణను కొనసాగించింది.
బాధితుడి కుటుంబం ఆరోపణలను ఉపసంహరించుకున్నా కోర్టుకు విచారణ కొనసాగించేఅధఇకారం ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు గల్ఫ్ న్యూస్ రాసింది. జైలు శిక్షను అనుభవించిన తర్వాత అతన్ని భారతదేశానికి పంపించేస్తారు.












Click it and Unblock the Notifications