ట్రంప్ ఎఫెక్ట్: సహజసిద్ధ పౌరసత్వం మటాష్, తొలి వ్యక్తి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ ప్రభావం భారత సంతతి వ్యక్తిపై పడింది. భారతదేశానికి చెందిన అమెరికా పౌరుడు తన సహజసిద్ధ పౌరసత్వాన్ని కోల్పోయాడు. ట్రంప్ పరిపాలనలో చేపట్టిన అక్రమ వలసల నియంత్రణలో భాగంగా తొలి వేటు భారతీయయుడిపై పడింది.

బల్జీందర్ సింగ్ అనే 43 ఏళ్ల వ్యక్తి న్యూజెర్సీలని కార్టరెట్‌లో నివసిస్తున్నాడు. అమెరికాకు చెందిన మహిళను పెళ్లి చేసుకుని 2006లో అమెరికా పౌరుడయ్యాడు. ఆయన 1991లో అమెరికా వచ్చాడు.

Indian-Origin Man Becomes First American To Lose Naturalised Citizenship Under Trump

ట్రావెల్ డాక్యుమెంట్లు, లేదా ఐడెంటీటీ ధృవీకరణ పత్రం లేకుండా శాన్ ఫ్రాన్సిస్కోలో అడుగు పెట్టాడు. తన పేరు దేవిందర్ సింగ్ అని చెప్పుకున్నట్లు జస్టిస్ డిపార్టుమెంట్ తెలిపింది. దాంతో 1992 జనవరిలో కోర్టు విచారణ తర్వాత వెనక్కి పంపించారు.

ఆ తర్వాత బల్జీందర్ సింగ్ అనే పేరుతో అమెరికా మహిళను పెళ్లి చేసుకున్నాడు. న్యూజెర్సీలోని ఫెడరల్ జడ్జి అతని పౌరసత్వాన్ని తొలగించారు. బల్జిందర్ సింగ్‌పై ప్రభుత్వంం ఫిర్యాదు చేసింది. దాంతో విచారణ జరిగింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A naturalized American from India has been stripped of his US citizenship, the first case under a government initiative designed to clamp down on fraudulent immigration.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి