అమెరికాలో జగన్ ఫ్యాన్స్ ర్యాలీ

Jagan's Bail Celebrations at Bloomington, IL
న్యూయార్క్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 16నెలల తర్వాత చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన నేపథ్యంలో అమెరికాలోని బ్లూమింగ్టన్, ఇల్లినాయిస్ నగరాల్లో జగన్ మద్దతుదారులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు సెప్టెంబర్ 28న కారు ర్యాలీ నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇల్లినాయిస్, బ్లూమింగ్టన్‌లోని జగన్, పార్టీ మద్దతుదారులు జై జగన్, జోహార్ రాజన్న, జై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నినాదాలు చేసుకుంటూ, జగన్‌పై పాటలు పాడుతూ సంబరాలు చేశారు. శనివారం ఉదయం 11గంటలకు వింగ్ ఓవర్ క్లబ్‌కు చేరుకున్న వారు దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్‌రెడ్డి చిత్ర పటానికి నివాళులర్పించారు. కేక్ కట్ చేసిన అనంతరం కార్యక్రమాన్ని ముగించారు.

ఈ సందర్భంగా వింగ్ ఓవర్ క్లబ్ నుంచి సుమారు 30 కార్లతో ర్యాలీ నిర్వహించారు. కార్లలో జగన్‌కు సంబంధించిన పాటలు పెట్టుకుని వెటర్న్స్ మెమోరియల్ పార్క్ వే, ఐర్లాండ్ గ్రోవ్, ఈస్ట్ ఓక్లాండ్ అవెన్యు, హెర్సే రోడ్, సౌత్ మెయిన్ రోడ్ ఎస్టి సర్కిల్ మీదుగా సుమారు 11 కిలోమీటర్ల మేర ర్యాలీని చేపట్టారు.
రాష్ట్రంలో గొప్ప నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు జగన్‌ల గురించి తెలుసుకునేందుకు చాలా మంది అమెరికన్లు ఆసక్తి చూపినట్లు జగన్ మద్దతుదారులు తెలిపారు.

ర్యాలీ అనంతరం ఇండియాకు చెందిన రంగోలి రెస్టారెంట్ నుంచి తెప్పించిన వంటకాలను పరిసర ప్రాంతాల ప్రజలకు అందజేసినట్లు తెలిపారు. మిస్సోరి, కెంటూకిలలో ఉంటున్న పమ్మి సుబ్బారెడ్డి, నాగిరెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న చాలామంది వైయస్ఆర్ అభిమానులు పాల్గొన్నారని చెప్పారు. లింగారెడ్డి గున్నమనేని, అంజన్ ఆర్ గోలి, శివారెడ్డిలతోపాటు పలువురు వైయస్సార్ పార్టీ మద్దతుదారులు ర్యాలీలో పాల్గొన్నట్లు వారు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+