జుంపా లహిరికి దక్కని యూఎస్ అవార్డు

ఈ అవార్డు కోసం మరికొందరు రచయితలు పోటీ పడ్డారు. వారిలో రచెల్ కుష్నర్ నవల ది ఫ్లేమ్ త్రోవర్స్, థామస్ పింఛన్ నవల బ్లీడింగ్ ఎడ్జ్, జార్జ్ సుందర్ నవల టెన్త్ డిసెంబర్‌లు పోటీలో నిలిచాయి. బుధవారం న్యూయార్క్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలు మెక్ బ్రైడ్ రచించిన నవలపై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా మెక్ బ్రైడ్ మాట్లాడుతూ.. పింఛన్, లహిరి, సౌందర్స్ లాంటి దిగ్గజ రచయితలు పోటీలో ఉండగా తనకు ఈ అవార్డు వస్తుందని అనుకోలేదని ఆయన చెప్పారు. వారందరూ గొప్ప రచయితలని అన్నారు. తనకు అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని మెక్ బ్రైడ్ పేర్కొన్నారు.
గత సంవత్సరంలో విడుదలైన ఫిక్షన్, నోటిఫికేషన్, పోయిట్రి, యంగ్ పీపుల్ లిటరేచర్ విభాగాల్లోని నవలలకు ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. అవార్డులను ప్రదానం చేసి నేషనల్ బుక్ పౌండేషన్ మెక్ బ్రైడ్ నవలను ఫిక్షన్ విభాగంలో ఎంపిక చేసింది. నోటిఫికేషన్ అవార్డు జార్జ్ ప్యాకర్ రచించిన ‘ది ఎన్ వైండింగ్: ఎన్ ఇన్నర్ హిస్టరీ ఆఫ్ ది న్యూ అమెరికా'కు దక్కింది. పోయిట్రి అవార్డు మేరి సైబిస్ట్ రచించిన 'ఇన్ కార్నడైన్‘ను వరించగా, యంగ్ పీపుల్ లిటరేచర్ అవార్డు సింథియా కడొహట రచించిన ‘ది థింగ్ ఎబౌట్ లక్' నవలకు గాను ప్రదానం చేయడం జరిగింది.
కాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన జుంపా లహిరి ఇంగ్లండ్‌లోని లండన్ లో జన్మించింది. లహిరి జన్మించిన తర్వాత వారి తల్లిదండ్రులు అమెరికాకు తమ నివాసాన్ని మార్చుకున్నారు. అప్పటి నుంచి న్యూయార్క్‌లోనే నివాసముంటున్న జుంపా లహిరి అమెరికాలో ప్రముఖ రచయితగా కొనసాగుతోంది. ప్రతిష్టాత్మకమైన మ్యాన్ బూకర్ ప్రైజ్‌కు తన నవల నామినేట్ అయినప్పటికీ ఆ అవార్డు కూడా ఆమెకు దక్కలేదు. ఆమె రచించిన ‘ఇంటర్ ప్రిటర్ ఆఫ్ మెలడీస్' నవలకు ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డుతోపాటు పెన్/హెమింగ్ వే అవార్డు వరించాయి.












Click it and Unblock the Notifications