‘లండన్‌లో బతుకమ్మ వేడుకలు’ పోస్టర్‌తో కవిత(ఫొటో)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరుగుతున్న మొట్ట మొదటి ‘బతుకమ్మ - దసరా సంబరాలు' పోస్టర్‌ని జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఆవిష్కరించారు.
అక్టోబర్ 11వ తేదీ నాడు తెలంగాణ ఎన్నారై ఫోరం (TeNF) ఆధ్వర్యం లో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఈవెంట్స్ సెక్రటరీ నగేష్ రెడ్డి కాసర్ల తెలిపారు.

అలాగే స్వదేశం నుండి అతిథులని ఆహ్వానించామని, వివరాలు త్వరలో తెలిపుతామని ఈవెంట్స్ సెక్రటరీ నగేష్ రెడ్డికాసర్ల, మహిళా విభాగం కో-ఆర్డినేటర్ అర్చన జువ్వాడి తెలిపారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యులు గంప వేణుగోపాల్,
ఎన్నారై తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ శానబోయిన, అధికార ప్రతినిది హరిగౌడ్ నవపేట్, తెలంగాణ కో-ఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్,నరేష్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications