తిరుమల శ్రీవారు మూగపిల్లాడికి మాటిచ్చేశారట

ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం కొంత కాలం క్రితం ఉద్యోగ రీత్యా లండన్ వెళ్లి స్థిరపడింది. 18 ఏళ్ల క్రితం వారికి దీపక్ అనే కుమారుడు జన్మించాడు. అయితే దీపక్ మూగ అని డాక్టర్లు తెలపడంతో బాలుడికి మూడున్నరేళ్ల వయసులో శ్రీవారిని దర్శించుకుని మొక్కుకున్నారు.
అనంతరం దీపక్ గురించి లండన్‌లో ఎందురో వైద్యులను సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీపక్ తన తల్లి,ఇ తర కుటుంబసభ్యులతో కలిసి శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి సన్నిధిలోని పడికావలి మండలం దగ్గరకు రాగానే దీపక్ గోవింద, గోవింద అని అన్నాడట. ఆ తర్వాత అమ్మా అని పిలవడంతో ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేశారు.
శ్రీవారి దర్శనానంతరం తమ కుమారుడికి మాటలు వచ్చాయని దీపక్ తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన టీటీడీ ఈవో గోపాల్ శ్రీవారి దయతోనే దీపక్‌కు మాటలు వచ్చాయని అన్నారు.












Click it and Unblock the Notifications