"ఎన్నారై కోఆర్డినేటర్ ఆయనేమిటి, తొలగించండి?"

లండన్: ఎటువంటి భాష పరిజ్ఞానం , సాహిత్య పరిచయం లేని వ్యాపారవేత్త అయిన మహేష్ బిగాలను తెలుగు ప్రపంచ మహాసభల ఎన్నారై సమన్వయకర్తగా నియమించడాన్ని టిపిసిసి ఎన్నారై సమన్వయకర్త గంప వేణుగోపాల్ తప్పు పట్టారు. ఎమ్మెల్యే గణేష్ బిగల తమ్ముడని చెప్పి ఎన్నారై సమన్వయకర్తగా నియమించి తెలుగు మహా సభల స్థాయిని తగ్గించారని ఆయన ఓ ప్రకటనలో అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ,ఇంగ్లాండ్ ,ఆస్ట్రేలియా ,దుబాయ్ ,సింగపూర్ అన్ని దేశాల్లో నిరసన వ్యక్త పరిచి వెంటనే మహేష్ బిగాలను ఆ పదవి నుండి తప్పించేలా చూడాలని ఆయన ఎన్నారైలను కోరారు.

NRIs oppose the appintment of Mahesh Bigala

అమెరికాలో నివాసం ఉంటున్న మహేష్ బిగాలను ఏ ప్రతిపాదికన తెలుగు సభల కోఆర్డినేటర్‌గా నియమించారని ఆయన అడిగారు. ఎటువంటి భాష పరిజ్ఞానం ,సాహిత్యం తెలియని వారిని నియమించడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని ఆయన అన్నారు.

మహేష్‌ను వెంటనే తొలగించి ఆ స్థానం లో సాహిత్యవేత్తలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. తనకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే గణేష్ బిగాల ఈ పదవి ఇప్పించారని చెప్పుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. ఎటువంటి సాహిత్య స్పృహ ,భాష ప్రావిణ్యం లేని వాళ్ళు విదేశాల్లో సమావేశాలు పెట్టి ఏమి మాట్లాడుతారని ,ఇది రాజకీయ పదవుల పంపకం కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+