బీఆర్ఎస్ గెలుపు కోసం ఎన్నారైల విస్తృత ప్రచారం: మహేష్ బిగాల
హైదరాబాద్: బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అధ్వర్యంలో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వివిధ ఎన్నారైల ప్రతినిధులతో తెలంగాణ భవన్‌లో ఎన్నారైల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బిగాల మీడియాతో మాట్లాడుతూ.. తామంతా బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రచారం చేస్తామని తెలిపారు.తెలంగాణాలో ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభమైందన్నారు.
ఇటీవల కేటీర్‌తో జరిగిన ఎన్నారైల సమావేశంలో క్షేత్ర స్థాయిలో ప్రచారములో పాల్గొనాలని పిలుపునిస్తే.. వివిధ దేశాల ఎన్నారైలు 100 మంది ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు. వివిధ మాధ్యమాల ద్వారా కేసీఆర్ ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారని తెలిపారు మహేష్ బిగాల. ప్రస్తుతం ఒక పక్క ప్రచారంలో బీఆర్‌ఎస్ దూసుకెళ్తుంటే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించే దశలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలకు ఎజెండా లేదు. కేవలం కేసీఆర్‌ను తిట్టడమే వారి ఎజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు.

కేసీఆర్ పది పథకాలు గురించి ప్రచారం చేస్తుంటే.. కాంగ్రెస్‌లో మాత్రం పది మంది సీఎం సీట్ల కోసం పోట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో వచ్చేది మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మహేష్ బిగాల స్పష్టం చేశారు. ఎన్నారైలంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తెలంగాణలో వచ్చేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందన్నారు.
ప్రస్తుత ట్రేండింగ్‌లో వున్నది ఎట్లున్న రాష్ట్రం.. ఎట్లయ్యింది? నిన్నటి గతుకుల ఇరుకు రోడ్లు.. నేడు నునుపుగా పెద్దగైనయ్. నిన్న భూత్ బంగళాల్లా కనిపించిన ప్రభుత్వ భవనాలు.. నేడు కార్పొరేట్ ఆఫీసులనే తలదన్నుతున్నయ్. అంతేనా.. రాజసాన్ని ఒలకబోస్తున్న సెక్రటేరియట్ ఒకవైపు.. తెలంగాణ అమర వీరుల స్మారకం మరోవైపు.. ఆకాశాన్ని ముద్దాడుతున్న అంబేద్కర్ విగ్రహం ఇంకోవైపు.. నేరాలపై డేగకన్ను పెట్టే బహుళ ప్రయోజనాల కమాండ్ కంట్రోల్ సెంటర్ వేరొకవైపు ఇలా.. ఒకటా రెండా.. తొమ్మిదిన్నరేళ్ల కలల తెలంగాణ పునర్ నిర్మాణంలో అభివృద్ధిని కళ్లకు కట్టిండ్రు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. తెలంగాణ ప్రగతి కండ్లముందు కనపడుతున్నది. ఎన్నారైలు అంతా కలిసి బీఆర్‌ఎస్ గెలుపు కోసం పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, అశోక్ దూసరి, చందు తల్లా, పూర్ణ బైరి, విన్నీ గౌడ్, విష్ణు జైగుండా వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్, అశోక్ దుసారి, చందు తల్లా, పూర్ణ బైరి , విన్నీ గౌడ్ , విష్ణు జైగుండా తో పాటు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మాల్దీవులు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications